చంద్రబాబు గురువు.. కేఏపాల్ శిష్యుడు..

ఏపీలో పరీక్షల రద్దుకోసం ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చేసిన దీక్షపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు శిష్యుడు కేఏపాల్.. గురువుని మించి డ్రామాలాడుతున్నారని అన్నారు. “కరోనా సమయంలో దీక్షలు చెయ్యాలని గురువు చంద్రబాబే అతన్ని పురమాయించాడా? సందట్లో సడేమియా అంటూ లోకేశంకు పోటీగా బయల్దేరాడు. అద్దె మైకు కదా నోటికొచ్చినట్లు మాట్లాడతాడు.” అని ట్వీట్ చేశారు. “కోవిడ్ కష్టకాలంలో ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు […]

Advertisement
Update:2021-05-03 04:45 IST

ఏపీలో పరీక్షల రద్దుకోసం ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చేసిన దీక్షపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు శిష్యుడు కేఏపాల్.. గురువుని మించి డ్రామాలాడుతున్నారని అన్నారు.

“కరోనా సమయంలో దీక్షలు చెయ్యాలని గురువు చంద్రబాబే అతన్ని పురమాయించాడా? సందట్లో సడేమియా అంటూ లోకేశంకు పోటీగా బయల్దేరాడు. అద్దె మైకు కదా నోటికొచ్చినట్లు మాట్లాడతాడు.” అని ట్వీట్ చేశారు.

“కోవిడ్ కష్టకాలంలో ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటళ్లలో చాలా వరకు చంద్రబాబు సన్నిహితులవే. ప్రభుత్వం తనిఖీలు చేస్తుంటే మూసి వేస్తామని బెదిరిస్తున్న ఈ హాస్పిటళ్ల యజమానులకు నచ్చజెప్పే బాధ్యతను బాబు తీసుకోవాలి. ఎక్కడో కూర్చుని తమాషా చూడటం కాదు.” అని అన్నారు.

“వ్యూహ రచనలో చాణక్యుడు అంతటి వాడినని భ్రమపడుతుంటాడు చంద్రబాబు. అందుకే ఏ పనికి ఏ ‘పార్టీ’ వాళ్లను వాడాలో వారిని ప్రయోగిస్తాడు. ఫిర్యాదులు, దీక్షలు చేయిస్తాడు. దీని వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అర్థం చేసుకునే లోపు సొంత మనుషులే ‘పార్టీ లేదు బొక్కా లేదు’ అని గోచీ పీకి వెళ్లిపోతారు.” అంటూ కేఏపాల్ సహా, అచ్చెన్నాయుడుపై కూడా సెటైర్లు వేశారు.

కేఏపాల్ దీక్ష వెనక ఉంది చంద్రబాబేనంటూ పరోక్షంగా విమర్శించారు విజయసాయిరెడ్డి. అవసరానికి తగ్గట్టు అన్ని పార్టీల వారిని చంద్రబాబు ప్రయోగిస్తుంటారని, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు. అయితే అలాంటి పనుల వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు.

ఎల్లో ఫెలోస్ అరెస్ట్ లపై లోకేష్ మొసలి కన్నీరు..
పచ్చ మనుషుల తదుపరి అరెస్ట్ లను దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ కి కొంతమంది స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారని, వారి పేరు చెప్పుకుని లోకేష్ మొసలి కన్నీరు కార్చడం మినహా ఇంకేమీ చేయరని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News