నేటి నుంచి సెలవలు.. నెల తర్వాత పరీక్షలు..

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవలు మొదలయ్యాయి. 1నుంచి 9 తరగతుల విద్యార్థులకు గతంలోనే సెలవలు ప్రకటించగా.. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు కూడా సెలవలు ఇచ్చేశారు. అయితే వీరంతా జూన్ 7నుంచి జరగబోయే పరీక్షలకు ఇంటినుంచే సమాయత్తం కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో స్కూల్ కి సెలవలు ఇచ్చినా.. పరీక్షలకోసం బాగా ప్రిపేర్ కావాలని, అవసరం అయితే.. ఫోన్ లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మే […]

Advertisement
Update:2021-05-01 10:24 IST

ఏపీలో పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవలు మొదలయ్యాయి. 1నుంచి 9 తరగతుల విద్యార్థులకు గతంలోనే సెలవలు ప్రకటించగా.. ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు కూడా సెలవలు ఇచ్చేశారు. అయితే వీరంతా జూన్ 7నుంచి జరగబోయే పరీక్షలకు ఇంటినుంచే సమాయత్తం కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో స్కూల్ కి సెలవలు ఇచ్చినా.. పరీక్షలకోసం బాగా ప్రిపేర్ కావాలని, అవసరం అయితే.. ఫోన్ లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారని విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

మే 5నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్న సందర్భంలో.. జూన్ 7నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలపై కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మే నెల మొత్తం స్కూల్స్ కి సెలవులు ప్రకటిస్తూ.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్జేడీలకు ఆదేశాలు ఇచ్చింది. సెలవుల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు డిజిటల్ మార్గాల ద్వారా సహకరించాల్సిందిగా టీచర్లను ఆదేశించారు అధికారులు. పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతోన్న విద్యార్ధులకు ఆన్ లైన్ ద్వారా సందేహాలు తీర్చాల్సిందిగా సూచించారు.

జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ పాఠశాలల్లో తిరిగి రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ విద్యాశాఖ‌. పదో తరగతి పరీక్షల నిర్వహణ, పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఏపీలో 6.3లక్షలమంది పదో తరగతి విద్యార్థులు జూన్ 7నుంచి మొదలయ్యే పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల విచారణ ఈనెల 3కి వాయిదా పడింది. అదే రోజు ప్రభుత్వాన్ని అఫిడవిట్ సమర్పించాల్సిందిగా హైకోర్టు సూచించింది.

Tags:    
Advertisement

Similar News