పోలింగ్​ ముందు పేలుడు.. బెంగాల్​లో కలకలం..!

బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్​ ముగిసిపోగా.. బెంగాల్​లో మాత్రం ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు ఇన్ని దశల్లో నిర్వహించడం సరికాదని.. తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం చాలా విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నది. బీజేపీ సూచనల మేరకే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే త్వరలో అక్కడ ఆరో విడత ఎన్నికలు జరుగబోతున్నాయి. కరోనా […]

Advertisement
Update:2021-04-22 06:58 IST

బెంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్​ ముగిసిపోగా.. బెంగాల్​లో మాత్రం ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు ఇన్ని దశల్లో నిర్వహించడం సరికాదని.. తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

అయినప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం చాలా విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నది. బీజేపీ సూచనల మేరకే ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే త్వరలో అక్కడ ఆరో విడత ఎన్నికలు జరుగబోతున్నాయి. కరోనా దృష్ట్యా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

బీజేపీ తన ఉనికి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. గతంలో ఉచితంగానే వ్యాక్సిన్​ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఆరో విడత ఎన్నికలకు ముందు బెంగాల్​లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసరడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు.

పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి.
24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జీసీ రోడ్‌లో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడగా.. రాజ్‌కిశోర్ జాదవ్(28) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బీజేపీ నేత సంతోష్ జేనా ఇంటికి సమీపంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గురువారం (ఏప్రిల్ 22) ఇక్కడ ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతున్నది. నాలుగో, ఐదో విడత ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. దీంతో ఎన్నికల సంఘం అదనపు బలగాలను దించి పోలింగ్​ నిర్వహిస్తోంది.

ప్రస్తుతం పోలింగ్​ జరుగుతున్న నియోజకవర్గాల్లో 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఆరో విడతలో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News