ఈ డైట్‌లు అంత మంచివి కావు

ఆరోగ్యం, ఫిట్‌నెస్ పేరుతో మార్కెట్లో రకరకాల డైట్ లు చలామణి అవుతున్నాయి. ఎవరికి వారు వాళ్లకి తోచిన డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇందులో కొన్ని నష్టాన్ని చేకూర్చే డైట్ లు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే వీటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అవేంటంటే.. బరువు తగ్గడం కోసం కీటోజెనిక్​ డైట్ ను చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఈ డైట్ లో కార్బో […]

Advertisement
Update:2021-04-20 10:52 IST

ఆరోగ్యం, ఫిట్‌నెస్ పేరుతో మార్కెట్లో రకరకాల డైట్ లు చలామణి అవుతున్నాయి. ఎవరికి వారు వాళ్లకి తోచిన డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇందులో కొన్ని నష్టాన్ని చేకూర్చే డైట్ లు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే వీటి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అవేంటంటే..
బరువు తగ్గడం కోసం కీటోజెనిక్​ డైట్ ను చాలామంది ఫాలో అవుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ఈ డైట్ లో కార్బో హైడ్రేట్స్ తక్కువగా, ఫ్యాట్స్​ ​ ఎక్కువగా ఉంటాయి. ఈ డైట్​ ఫాలో అవ్వడం వల్ల శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్స్​ అందక బాడీ కీటోసిస్​ స్టేజ్​​లోకి వెళ్లిపోతుంది. ఫలితంగా బాడీలోని ఫ్యాట్​ అంతా కరిగి బరువు తగ్గుతారు. కానీ కేవలం ప్రొటీన్స్, ఫ్యాట్​ ఎక్కువ మొత్తంలో నెలలు తరబడి తీసుకోవడం వల్ల కిడ్నీపై ఒత్తిడి పెరుగే ప్రమాదం ఉంది. ఫలితంగా కిడ్నీ సమస్యలొస్తాయి. బాడీలో కొలెస్ట్రాల్​ లెవల్స్​ కూడా పెరుగుతాయి. అందుకే ఈ డైట్ తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

వీటితో పాటు, జీఎమ్​ డైట్, మాస్టర్​ క్లీన్స్​ డైట్​లు కూడా ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. జిఎమ్​ డైట్​లో ఏడురోజుల పాటు ధాన్యాలు, పాల ఉత్పత్తులు, రిఫైండ్​ షుగర్, సీ ఫుడ్​కి దూరంగా ఉండాలి. అలా వారానికి కిలో చొప్పున తగ్గుతారు. కానీ, వారం రోజుల పాటు బాడీకి ప్రొటీన్లు, విటమిన్లు అందక చాలా సమస్యలొచ్చే అవకాశం కూడా ఉంది.

అలాగే మాస్టర్​ క్లీన్స్​ డైట్​లో రోజంతా నిమ్మరసం తాగుతుండాలి. దీనివల్ల బాడీలో డిటాక్సిఫికేషన్​ జరిగి బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో హానికర టాక్సిన్స్​ కూడా బాడీ నుంచి బయటికెళ్తాయి. కానీ ఈ డైట్ వల్ల తలనొప్పి, అలసట, చిరాకు, మలబద్ధకం సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే నచ్చిన డైట్ ను ఎంచుకునే ముందు ఓ సారి డాక్టర్ లేదా న్యూట్రిషనిస్టుని సంప్రదించి సలహా తీసుకోవడం బెటర్.

Tags:    
Advertisement

Similar News