‘పొలవరం’ అంచనాలు పెంచారు.. కారణం ఇదే..!
పొలవరం ప్రాజెక్టు అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పొలవరం అంచనాలు ఉన్నట్టుండి ఎందుకు పెంచారు? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజానికి ఇటీవల డీడీఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ తర్వాత కొత్త డిజైన్లు ప్రతిపాదించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో భారీ మార్పు చోటుచేసుకున్నది. కొత్త డిజైన్‌కు అనుగుణంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో అప్రోచ్ చానెల్ లో 32 లక్షల […]
పొలవరం ప్రాజెక్టు అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పొలవరం అంచనాలు ఉన్నట్టుండి ఎందుకు పెంచారు? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజానికి ఇటీవల డీడీఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ తర్వాత కొత్త డిజైన్లు ప్రతిపాదించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో భారీ మార్పు చోటుచేసుకున్నది. కొత్త డిజైన్‌కు అనుగుణంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు.
గతంలో అప్రోచ్ చానెల్ లో 32 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తవ్వాల్సి ఉండేది. అయితే డీడీఆర్పీ సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఇది 1.16 కోట్ల క్యూబిక్ మీటర్లు పెరిగింది. దీంతో అంచనాలను కూడా పెంచేశారు.
స్పిల్ ఛానెల్ ఎండ్ కట్ ఆప్ వాల్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీంతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానెల్ కి ఇరువైపులా ఉన్న కొండలకు రక్షణ చర్యలు చేపట్టబోతున్నారు.
మరోవైపు గ్యాప్-1, ఎర్త్ డ్యాం నిర్మాణం, గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం,
గ్యాప్-1 అప్రోచ్ ఏరియాలో ప్రొటెక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను డీడీఆర్పీ అదనంగా సూచించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులను పెంచబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.