ఏపీలో పాక్షిక లాక్​డౌన్​? అధికారులతో సీఎం జగన్​ అత్యవసర భేటీ..!

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీలో సెకండ్​ వేవ్​ కరోనా రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్​ డోసులు కావాలంటూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మరోవైపు రాష్ట్రంలో పాక్షిక లాక్​డౌన్​ విధించాలని సీఎం జగన్​ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇవాళ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. పదో తరగతి పరీక్షల రద్దు, నైట్​ కర్ఫ్యూ, ఇంటర్​ పరీక్షల వాయిదా, స్కూళ్లకు […]

Advertisement
Update:2021-04-19 05:17 IST

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీలో సెకండ్​ వేవ్​ కరోనా రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్​ డోసులు కావాలంటూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

మరోవైపు రాష్ట్రంలో పాక్షిక లాక్​డౌన్​ విధించాలని సీఎం జగన్​ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇవాళ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. పదో తరగతి పరీక్షల రద్దు, నైట్​ కర్ఫ్యూ, ఇంటర్​ పరీక్షల వాయిదా, స్కూళ్లకు సెలవులు తదితర విషయాలపై సీఎం జగన్​ నిర్ణయం తీసుకోనున్నారు.

దేవాలయాలు, ధార్మిక కార్యక్రమాలపై కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. బార్లు, రెస్టారెంట్ల‌పై ఆంక్షలు కూడా విధించబోతున్నట్టు తెలుస్తున్నది. మార్కెట్లు, దుకాణాలు, దుకాణ సముదాయాలు కేవలం నిర్ణీత వేళల్లో మాత్రం తెరిచి ఉంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై సీఎం జగన్​ అధికారులకు పలు సూచనలు ఇవ్వబోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్​ రోగులకు తగిన ఏర్పాట్లు చేయాలని.. ప్రైవేట్​ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం జగన్​ అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని, సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

ఇటీవల జరిగిన వరస ఎన్నికలు, పండగలు, ఉత్సవాల నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Tags:    
Advertisement

Similar News