క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ ఎందుకంటే?
భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోను చూపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
దేశ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ప్రధాని దాదాపు 15-20 నిమిషాలు ఆలస్యంగా హజరయ్యారు. అయితే తన ఆలస్యానికి గల కారణాని తెలియజేస్తూ సదస్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రంలో 10,12 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ప్రారంభమయ్యే సమయం నేను రాజ్ భవన్ నుంచి బయలుదేరే సమయం ఒక్కటే. అప్పుడు నేను బయటకు వస్తే భద్రతా కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు వెళ్లిన తర్వాత తాను రాజ్ భవన్ నుంచి బయలుదేరారనని అందువల్ల ఈ సదస్సుకు ఆలస్యంగా రావాల్సి వచ్చింది. మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు కోరుతున్నాన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం ఆశాభావంతో ఉందని ప్రధాని అన్నారు.
‘‘జనాభాపరంగా మధ్యప్రదేశ్ ఐదో అతిపెద్ద రాష్ట్రం. వ్యవసాయం, ఖనిజాల పరంగా ముందువరుసలో ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టిసారించింది. 20 సంవత్సరాలకు ముందు ఇక్కడికి రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందువరుసలో ఉంది. అలాగే సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్‌గా మారిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం కీర్తించింది. ఇతర దేశాలు మాటలతో ఆగిపోతుంటే.. భారత్ చెప్పింది చేసి చూపించిందని ఆ సంస్థే పేర్కొంది. భారత్ మాటలకే పరిమితం కావడం లేదని, చేతల్లోను చూపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఆర్థికరంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు చెప్పిందని గుర్తుచేశారు