ముఖాన్ని డీట్యాన్ చేయండిలా..

ఈ సమ్మర్ లో స్కిన్ ట్యాన్ అయ్యి నల్లగా మారిపోతుంటుంది. చర్మం ఇలా తరచూ ట్యాన్ అవ్వడం వల్ల వాడిపోయి డల్ గా కనిపిస్తుంది. అందుకే సమ్మర్ లో స్కిన్ ను డీట్యాన్ చేస్తుండాలి. ఎండకు ట్యాన్ అవ్వడం వల్ల చర్మం కమిలిపోయినట్టు కనిపిస్తుంది. అయితే చర్మం తిరిగి మళ్లీ తాజాగా కనిపించాలంటే.. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే.. అలోవేరా ప్యాక్‌: అలోవేరా గుజ్జుకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ట్యాన్ అయిన చోట అప్లై […]

Advertisement
Update:2021-04-15 09:41 IST

ఈ సమ్మర్ లో స్కిన్ ట్యాన్ అయ్యి నల్లగా మారిపోతుంటుంది. చర్మం ఇలా తరచూ ట్యాన్ అవ్వడం వల్ల వాడిపోయి డల్ గా కనిపిస్తుంది. అందుకే సమ్మర్ లో స్కిన్ ను డీట్యాన్ చేస్తుండాలి. ఎండకు ట్యాన్ అవ్వడం వల్ల చర్మం కమిలిపోయినట్టు కనిపిస్తుంది. అయితే చర్మం తిరిగి మళ్లీ తాజాగా కనిపించాలంటే.. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

అలోవేరా ప్యాక్‌: అలోవేరా గుజ్జుకు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ట్యాన్ అయిన చోట అప్లై చేయాలి. తర్వాత చన్నీటితో కడిగేయాలి. దీంతో చర్మంలో నీటిశాతం పెరిగి తిరిగి కాంతివంతంగా మారుతుంది. కలబంద శరీరంలోని మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పిగ్మంటేషన్‌ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

క్యారెట్ ఫ్యాక్: క్యారట్‌ ను మెత్తగా ఉడకబెట్టుకుని మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అందులో నాలుగు టీ స్పూన్ల తేనె కలుపుకొని, ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆయిలీ స్కిన్ వారికి బాగా పనికొస్తుంది.

టమోటా ప్యాక్‌: ఒక టమోటాను తరిగి దానికి ఒక స్పూను పాలు చేర్చి మిశ్రమంలా కలపాలి. ఇందులో ఒక టీస్పూన్ పసుపు, కాస్త నిమ్మరసం, ఒక టీస్పూను తేనె వేసి బాగా కలిపి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి.

శనగపిండి ప్యాక్‌: శనగపిండికి చిటికెడు పసుపు, కొద్దినగా నారింజ తురుము, ఒక టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి కలిపి చర్మానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

పుచ్చకాయ: సమ్మర్ లో పుచ్చకాయను రోజూ తినడంతో పాటు ఫేస్ కు అప్లై చేసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది. పుచ్చకాయను పెద్ద ముక్కలా తరిగి దాన్ని తేనెలో ముంచి ముఖానికి రాసుకుని రెండు నిమిషాలు మర్దన చేస్తే చాలా.. చర్మం హైడ్రేట్ అయ్యి, తాజాగా మారుతుంది.

Tags:    
Advertisement

Similar News