మహారాష్ట్రలో లాక్ డౌన్ తరహా నిబంధనలు..

లాక్ డౌన్ అనే పేరు మినహా.. మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కట్టుదిట్టం చేసింది. జనతా కర్ఫ్యూ పేరుతో పగటి పూట 144 సెక్షన్ విధించడంతోపాటు, రాత్రి వేళ.. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ కట్టు దిట్టం చేస్తున్నారు. ఈరోజు రాత్రి 8గంటలనుంచి మే 1 ఉదయం 7 గంటల వరకు 15రోజులపాటు లాక్ డౌన్ తరహా కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అత్యవసర సేవలకు […]

Advertisement
Update:2021-04-14 05:05 IST

లాక్ డౌన్ అనే పేరు మినహా.. మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు కట్టుదిట్టం చేసింది. జనతా కర్ఫ్యూ పేరుతో పగటి పూట 144 సెక్షన్ విధించడంతోపాటు, రాత్రి వేళ.. పూర్తి స్థాయిలో కర్ఫ్యూ కట్టు దిట్టం చేస్తున్నారు. ఈరోజు రాత్రి 8గంటలనుంచి మే 1 ఉదయం 7 గంటల వరకు 15రోజులపాటు లాక్ డౌన్ తరహా కఠిన నిబంధనలు అమలులో ఉంటాయని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.

అత్యవసర సేవలకు మినహాయింపు..
లాక్ డౌన్ నిబంధనలనుంచి వైద్య సేవలను మినహాయించారు.
ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది, అయితే 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన పాటించాలి.
పారిశుధ్య, పశు వైద్య కార్యకలాపాలు కూడా యధావిధిగా కొనసాగించవచ్చు
ఆహారానికి సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరచి ఉంచాలి
ఈకామర్స్ సేవలకు మినహాయింపు
పెట్రోల్ పంపులకు, బ్యాంకింగ్ కార్యకలాపాలకు నిబంధనల సడలింపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు మినహాయింపు
న్యూస్ పేపర్ల ముద్రణ, పంపిణీపై ఆంక్షలు లేవు, అక్రిడేటెడ్ జర్నలిస్ట లకు మినహాయింపు..

వీటిపై పూర్తిగా ఆంక్షలు..
ఆహార పదార్ధాలు మినహా మిగతా అన్ని షాపుల మూసివేత, షాపింగ్ మాల్స్ అన్నీ క్లోజ్.
సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు మూత
జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్ లపై నిషేధం
ప్రార్థనా స్థలాలపై ఆంక్షల కొనసాగింపు, కేవలం నిత్య పూజలు, ప్రార్థనలకు మాత్రం అనుమతి
బీచ్ లు, పార్క్ లలో ప్రవేశం నిషేధం
స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు సెలవు
సినిమా, సీరియల్, యాడ్ షూటింగ్ లపై నిషేధం.

జనతా కర్ఫ్యూలో భాగంగా రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలవుతుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదు. దుకాణాలను, బహిరంగ ప్రదేశాలను మూసివేస్తారు. ప్రజా రవాణాకు అనుమతి ఇస్తున్నా.. నలుగురు వ్యక్తులు గుమికూడితే మాత్రం పోలీసులు బాదిప పడేస్తారు. అంతే కాదు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలను 15రోజులపాటు కఠినంగా అమలు చేస్తామని చెప్పారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. చాలా రోజులుగా లాక్ డౌన్ పై ప్రజల్ని హెచ్చరిస్తున్న ఆయన చివరిగా ఆ పదం లేకుండానే ఆంక్షలను అమలులోకి తెచ్చేశారు.

Tags:    
Advertisement

Similar News