ఇండస్ట్రీలో మరో సినిమా వాయిదా
ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా పడింది. ఆచార్య సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి టక్ జగదీశ్ కూడా చేరిపోయింది. ఈ సినిమా వాయిదా పడినట్టు అధికారికంగా ప్రకటించారు. పనిలోపనిగా ఉగాది పోస్టర్ రిలీజ్ చేసి మరీ వాయిదా పడిన మేటర్ ను బయటపెట్టడం విశేషం. “టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు […]
ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా పడింది. ఆచార్య సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి టక్ జగదీశ్ కూడా చేరిపోయింది. ఈ సినిమా వాయిదా పడినట్టు అధికారికంగా
ప్రకటించారు. పనిలోపనిగా ఉగాది పోస్టర్ రిలీజ్ చేసి మరీ వాయిదా పడిన మేటర్ ను బయటపెట్టడం
విశేషం.
“టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా
వస్తుంది.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయింది,
అంతేకాదు ఉగాదికి రావాల్సిన ట్రైలర్ కూడా వాయిదా పడింది. ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో..
అప్పుడే కొత్త విడుదల తేదీ కూడా అందులోనే ఉంటుంది”
ఇలా టక్ జగదీష్ సినిమా పోస్ట్ పోన్ అయిందనే విషయాన్ని నాని స్వయంగా బయటపెట్టాడు. ‘నిన్నుకోరి’
వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న
ఫ్యామిలి ఎంటర్టైనర్ 'టక్ జగదీష్. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో
నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.