వామపక్షాలు రూటు మార్చాయా? సాగర్​లో టీఆర్​ఎస్​కు మద్దతు..!

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు ఎంతో బలంగా ఉండేవి . కానీ రాను రాను వాటి బలం క్రమంగా పడిపోయింది. ఏదో ఓ రాజకీయ పార్టీతో పొత్తుపెట్టుకొని.. ఒకటి రెండు సీట్లకు మాత్రమే ఆ పార్టీలు పోటీచేస్తున్నాయి. ఇదిలా ఉంటే నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే కొంతమేర వామపక్షాల ప్రభావం ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో సీపీఎం, సీపీఐ బలంగా ఉంటాయి. ప్రస్తుతం సాగర్​లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్​ఎస్​కు […]

Advertisement
Update:2021-04-11 06:21 IST

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు ఎంతో బలంగా ఉండేవి . కానీ రాను రాను వాటి బలం క్రమంగా పడిపోయింది. ఏదో ఓ రాజకీయ పార్టీతో పొత్తుపెట్టుకొని.. ఒకటి రెండు సీట్లకు మాత్రమే ఆ పార్టీలు పోటీచేస్తున్నాయి. ఇదిలా ఉంటే నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే కొంతమేర వామపక్షాల ప్రభావం ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో సీపీఎం, సీపీఐ బలంగా ఉంటాయి.

ప్రస్తుతం సాగర్​లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్​ఎస్​కు మద్దతు ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే విడుదల కాలేదు. కానీ ఇప్పటికే కిందిస్థాయి కమ్యూనిస్టు నేతలు టీఆర్​ఎస్​ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

అయితే సాగర్​ నియోజకవర్గంలో కేసీఆర్​ వ్యూహాత్మకంగా దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్​ పేరును తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. నోముల నరసింహయ్య గతంలో కమ్యూనిస్టులో కీలకనేతగా ఉన్నారు. ఆయన టీఆర్​ఎస్​లో చేరడంతో ఆయన అనుచరగణమంతా ఆ పార్టీలోనే చేరింది.

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ భగత్​కు టికెట్​ ఇవ్వడంతో వామపక్ష పార్టీలు ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయట. మరోవైపు ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య సైతం టీఆర్​ఎస్​కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బీసీలంతా భగత్​ కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సాగర్​లో ప్రచారం ఊపందుకున్నది. జానారెడ్డికి మద్దతుగా కాంగ్రెస్​ నేతలంతా రంగంలోకి దిగారు. ఓ వైపు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి.. మరోవైపు రేవంత్​రెడ్డి జానాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక, జీహెచ్​ఎంసీ, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఈ సారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్​ వ్యూహం రచిస్తున్నది. అందరికంటే ముందే కాంగ్రెస్​ జానారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించేసింది. ఇప్పటికే జానారెడ్డి కూడా ఓ దశ ప్రచారం పూర్తిచేసుకున్నారు.

అయితే టీఆర్​ఎస్​ నేతలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా మోహరించారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మండలాలను విభజించుకొని ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే అక్కడ సీఎం కేసీఆర్​ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వామపక్షల మద్దతు టీఆర్​ఎస్​కు కలిసి వస్తుందో? లేదో ? వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News