టెన్షన్ ఫ్రీ లైఫ్ కోసం ఇలా చేస్తే సరి!

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది.. ఎలాంటి టెన్షన్స్ లేని లైఫ్.. కానీ దురదృష్టవశాత్తూ.. ప్రస్తుతం ఒత్తిడి, టెన్షన్ అనేవి డైలీ లైఫ్ లో భాగంగా మారిపోయాయి. ఎన్నో రకాల టెన్షన్ ల మధ్యే డైలీ లైఫ్ నలిగి పోతుంది. మరి దీని నుంచి రీలీఫ్ పొందాలంటే ఏంచేయాలి.. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ కి గురవ్వడం ప్రస్తుతం కామన్ గా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో.. ప్రతిరోజూ.. రకరకాల టెన్షన్ లు చుట్టుముడుతుంటాయి. అయితే కాస్త ఎరుకతో.. […]

Advertisement
Update:2021-04-09 09:02 IST

ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది.. ఎలాంటి టెన్షన్స్ లేని లైఫ్.. కానీ దురదృష్టవశాత్తూ.. ప్రస్తుతం ఒత్తిడి, టెన్షన్ అనేవి డైలీ లైఫ్ లో భాగంగా మారిపోయాయి. ఎన్నో రకాల టెన్షన్ ల మధ్యే డైలీ లైఫ్ నలిగి పోతుంది. మరి దీని నుంచి రీలీఫ్ పొందాలంటే ఏంచేయాలి..

ప్రతి చిన్న విషయానికి టెన్షన్ కి గురవ్వడం ప్రస్తుతం కామన్ గా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో.. ప్రతిరోజూ.. రకరకాల టెన్షన్ లు చుట్టుముడుతుంటాయి. అయితే కాస్త ఎరుకతో.. కొన్ని చిట్కాలతో.. ఇలాంటి టెన్షన్స్ ను దూరం పెట్టొచ్చు. అవేంటంటే..

ఆహారం ముఖ్యం
ఒత్తిడిని తగ్గించడానికి సరైన ఆహారం ముఖ్యం. ఆహారంలో పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటుండాలి. వీటిలో ఉండే పొటాషియం మెదడుకు బలాన్నిస్తుంది. అలాగే తాజాగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎప్పుడూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. వీటితోపాటు ఆకు కూరలు, గోధుమలు, సోయాబీన్, వేరుశెనగ గింజలు లాంటివి మెదడులో ఒత్తిడిని తగ్గించేందుకు సాయపడతాయి.

పంచుకోవడం ద్వారా..
ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే టెన్షన్ పడిపోతుంటారు చాలామంది. అయితే సమస్యను మనతోనే ఉంచుకోకుండా పక్కవారితో పంచుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి కొంతవరకూ బయటపడొచ్చు. సమస్యలను షేర్ చేసుకోకుండా ఒంటరిగా ఆలోచించడం ద్వారా దాని తీవ్రత మరింత ఎక్కువై ఒత్తిడికి దారి తీస్తుంది.

ధ్యానం, ప్రాణాయామంతో..
ఏమీ చేయకుండా ప్రశాంతంగా కాసేపు అలా కూర్చోవడం ద్వారా ఒత్తిడులన్నీ మాయమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇంకా కుదిరితే.. ధ్యానం, ప్రాణాయామం లాంటి వాటిని కూడా ట్రై చేయొచ్చు. రోజువారి పనుల్లో ఎన్నో రకాల అనవసరమైన పనులకోసం సమయం కేటాయిస్తాం. వాటితో పాటే ఓ అరగంట ప్రశాంతంగా కూర్చోవడం కోసం కేటాయిస్తే.. మెల్లమెల్లగా మెదడు నెమ్మదించి, టెన్షన్స్ అన్నీ మాయమవ్వడం గమనించొచ్చు.

Tags:    
Advertisement

Similar News