రిస్క్ లోనే కిక్ ఉంది " నాగార్జున

వైల్డ్ డాగ్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్ చెప్పాడు నాగార్జున. ఈ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాగ్.. ప్రయోగాలు తనకు కొత్త కాదంటున్నాడు. నాగార్జున ఇంకా ఏం అంటున్నాడో చూద్దాం. – చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవ‌స‌ర‌మా అన్నారు. నేను రిస్కులు చేయ‌బ‌ట్టే ఈ స్టాయికి రాగ‌లిగాను. రిస్క్ చేయ‌డం నాకు కొత్తేమి కాదు.. ప్రేమించే ప‌ని చేసిన‌ప్పుడు శ్ర‌మ ఎప్పుడు ఉండ‌దు. – ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన […]

Advertisement
Update:2021-04-03 15:17 IST

వైల్డ్ డాగ్ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్ చెప్పాడు నాగార్జున. ఈ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడిన నాగ్.. ప్రయోగాలు తనకు కొత్త కాదంటున్నాడు. నాగార్జున ఇంకా ఏం అంటున్నాడో చూద్దాం.

– చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవ‌స‌ర‌మా అన్నారు. నేను రిస్కులు చేయ‌బ‌ట్టే ఈ స్టాయికి రాగ‌లిగాను. రిస్క్ చేయ‌డం నాకు కొత్తేమి కాదు.. ప్రేమించే ప‌ని చేసిన‌ప్పుడు శ్ర‌మ ఎప్పుడు ఉండ‌దు.

– ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వ‌చ్చిన బెస్ట్ అప్రిసియేష‌న్‌. ఇంత మంచి అప్లాజ్ వ‌స్తున్నందుకు ద‌ర్శ‌కుడు సాల్మ‌న్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ మంచి స‌పోర్ట్ చేశారు.

– నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమా రిలీజ్‌ చేయాలా? ఆడియన్స్‌ వస్తారా? అనుకున్నాం. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల సపోర్ట్ త‌ప్ప‌కుండా ఉంటుందని మరోసారి నిరూపితమైంది.

– నన్ను ప్రొత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే నేను కొత్తరకం సినిమాలు చేయగలగుతున్నాను. వారికి ఎప్ప‌టికీ ఋణ‌‌ప‌డి ఉంటాను. వారి నుంచి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తున్నందుకు హ్యాపీ.

Tags:    
Advertisement

Similar News