హాట్ సమ్మర్‌‌లో కూల్ ఫ్రూట్స్..

ఆరోగ్యానికి పండ్లు చేసేమేలు అంతా ఇంతా కాదు. సీజన్ కు తగ్గట్టు పండే పండ్లను తినడం ద్వారా ఎప్పుడూ హెల్దీగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సమ్మర్ లో ఒంట్లో వేడిని తగ్గించి, శరీరంలో నీటిశాతాన్ని పెంచేందుకు కొన్ని ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే.. సమ్మర్ లో సూర్యుడి వేడి తాకిడికి శ‌రీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుంద‌ఇ. అందుకే వేస‌విలో శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచాలి. దానికోసం ఈ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి. వేస‌విలో ఎక్కువగా దొరికే […]

Advertisement
Update:2021-03-27 10:01 IST

ఆరోగ్యానికి పండ్లు చేసేమేలు అంతా ఇంతా కాదు. సీజన్ కు తగ్గట్టు పండే పండ్లను తినడం ద్వారా ఎప్పుడూ హెల్దీగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సమ్మర్ లో ఒంట్లో వేడిని తగ్గించి, శరీరంలో నీటిశాతాన్ని పెంచేందుకు కొన్ని ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే..

సమ్మర్ లో సూర్యుడి వేడి తాకిడికి శ‌రీరంలో నీరు ఇట్టే ఆవిరైపోతుంద‌ఇ. అందుకే వేస‌విలో శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచాలి. దానికోసం ఈ ఫ్రూట్స్ బాగా ఉపయోగపడతాయి.
వేస‌విలో ఎక్కువగా దొరికే ఫ్రూట్ పుచ్చకాయ. పుచ్చకాయ‌లో 90 శాతం నీరే ఉంటుంది. అందుకే సమ్మర్ లో రోజూ పుచ్చకాయ తినడం ద్వారా శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవచ్చు

వేస‌విలో ముఖ్యంగా తినాల్సిన వాటిలో కీరదోస‌ కూడా ఒకటి. ఇందులో కూడా 70 శాతం నీరే ఉంటుంది. అందుకే ఇవి తినడం ద్వారా శ‌రీరం చ‌ల్లబడుతుంది. శ‌రీరానికి త‌గినంత నీరు ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

వీటితో పాటు సమ్మర్ లో తాటి ముంజ‌లు కూడా ఎక్కువ‌గా ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోవడమే కాకుండా, వీటిలో ఉండే కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, కాప‌ర్‌, మెగ్నీషియం, సెలీనియం త‌దిత‌ర పోష‌కాలు శ‌రీరంలో ఉండే నీటి శాతం త‌గ్గకుండా చూస్తాయి.
వేసవిలో దొరికే మరో ఫ్రూట్.. ద్రాక్ష. ఇందులో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం చల్లగా ఉంటుంది.
అలాగే వేస‌విలో స‌పోటా పండ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. సపోటాలతో తక్షణ శ‌క్తి ల‌భిస్తుంది. ఎన్నో పోషకాలతో పాటు, ఒంట్లో ఉన్న నీరు త‌గ్గిపోకుండా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News