నిమ్మగడ్డ తర్వాత నీలం సాహ్ని..

ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని పేరుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు ప్రతిపాదనల్లో ఆయన నీలం సాహ్ని పేరుని ఎంపిక చేశారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుండగా.. ఆ వెంటనే ఆమె పదవీ బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన ఆమె.. ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు. […]

Advertisement
Update:2021-03-27 02:08 IST

ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని పేరుని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన మూడు ప్రతిపాదనల్లో ఆయన నీలం సాహ్ని పేరుని ఎంపిక చేశారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుండగా.. ఆ వెంటనే ఆమె పదవీ బాధ్యతలు చేపడతారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన ఆమె.. ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా విధులు నిర్వహిస్తున్నారు.

శామ్యూల్, ప్రేమ్ చంద్రారెడ్డి పేర్ల పరిశీలన..
ఆనవాయితీ ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారులైన నీలం సాహ్ని, శామ్యూల్, ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. శామ్యూల్ ప్రస్తుతం నవరత్నాల కార్యక్రమ పర్యవేక్షణ సలహాదారుగా ఉండగా, ప్రేమ్ చంద్రారెడ్డి రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో నీలం సాహ్ని పేరుని గవర్నర్ ఖరారు చేశారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌లను ఆమె నిర్వహించాల్సి ఉంటుంది.

నీలం సాహ్ని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ‌లోని మచిలీపట్నం సహాయ కలెక్టర్‌ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత 2019 నవంబరు 13న నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2020 డిసెంబరు వరకు ఆ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ అనంతరం సీఎం జగన్‌ కు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. నీలం సాహ్ని భర్త అజయ్‌ ప్రకాష్‌ సాహ్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News