వ్యాక్సిన్ తర్వాత కూడా పాజిటివ్.. కారణమేంటంటే..
వ్యాక్సిన్ రాకతో జనాల్లో కొంతవరకూ ధైర్యం పెరిగింది. అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా పాజిటివ్ రావడం ఇప్పుడు కలవరపెడుతోంది. అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని డౌట్ వస్తుంది. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా కోవిడ్ పాజిటివ్ అని వస్తుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన ఎందుకు పడుతున్నారనే దానిపై నిపుణులు కొన్ని కారణాలు చెప్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వ్యాక్సిన్ అనేది […]
వ్యాక్సిన్ రాకతో జనాల్లో కొంతవరకూ ధైర్యం పెరిగింది. అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా పాజిటివ్ రావడం ఇప్పుడు కలవరపెడుతోంది. అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని డౌట్ వస్తుంది. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..
కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా కోవిడ్ పాజిటివ్ అని వస్తుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన ఎందుకు పడుతున్నారనే దానిపై నిపుణులు కొన్ని కారణాలు చెప్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వ్యాక్సిన్ అనేది వైరస్ తో వచ్చే వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుందని, వ్యాక్సిన్ సోకకుండా అది ఆపలేదని వాళ్ల అభిప్రాయం. అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాస్క్ ధరించకపోవడం, శానిటైజ్ చేసుకోకపోవడం లాంటి చర్యల వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉంటుందని, అయితే సోకిన వైరస్ తో వ్యాక్సిన్ పోరాడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. తీవ్ర అస్వస్ధత, మరణాలను నిరోధించడం వరకే వ్యాక్సిన్ సామర్ధ్యం పనిచేస్తుందని, అది కూడా రెండో డోసు తీసుకున్న రెండు మూడు వారాల తర్వాతనే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. అందుకే వ్యాక్సినేషన్ తర్వాత కూడా ప్రజలు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.