బీజేపీ ఎత్తులకు .. కేసీఆర్ పై ఎత్తు..!
ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. సాగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను చాలా మంది ఆశిస్తున్నారు. కానీ బీజేపీ.. మాత్రం ఇతర పార్టీల నేతల కోసం ఎదురుచూస్తున్నది. సూటిగా చెప్పాలంటే .. టీఆర్ఎస్ ఓ అభ్యర్థిని ఎంపిక చేస్తే.. అక్కడి అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలన్నది బీజేపీ […]
ప్రస్తుతం తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు? అన్న విషయంపై ఆసక్తి నెలకొన్నది. సాగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను చాలా మంది ఆశిస్తున్నారు. కానీ బీజేపీ.. మాత్రం ఇతర పార్టీల నేతల కోసం ఎదురుచూస్తున్నది. సూటిగా చెప్పాలంటే .. టీఆర్ఎస్ ఓ అభ్యర్థిని ఎంపిక చేస్తే.. అక్కడి అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలన్నది బీజేపీ ఆలోచన. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేసీఆర్.. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేశారు. ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టనున్నట్లు సమాచారం.
నామినేషన్‌కు ఆఖరి రోజున ఆయన అభ్యర్థిని ఖరారు చేస్తారు. అప్పటివరకు టీఆర్ఎస్ ఆశావహులకు విషయం చెప్పరు. ఒకవేళ ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే.. అసంతృప్తులు బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉన్నది. సరిగ్గా చివరిరోజు టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప్పరెడ్డి.. మరికొందరు నేతలు టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే తేరా చిన్నప్పరెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం వస్తుందా? లేదా? అన్న విషయం గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నది. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని వారిని తమ పార్టీలోకి ఆహ్వానించి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నది.
టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య తనయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే టికెట్ ఇవ్వకపోతే సదరు నేతలు రెబల్‌గా పోటీచేసే అవకాశం ఉంది. లేదంటే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏది జరిగినా ఆ పార్టీకి నష్టమే. కాబట్టి ఆఖరిరోజే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి సాగర్‌లో పెద్దగా బలంగా లేదు. ఆ పార్టీకి అక్కడ క్యాడర్ కూడా లేదు. దీంతో పక్కపార్టీ వైపు చూస్తున్నది. ఒకవేళ ఇతర పార్టీల నుంచి ఎవరూ వలసలు రాకపోతే .. కంకణాల నివేదితరెడ్డికి అవకాశం ఉంది.