తప్పంతా చంద్రబాబుదే -మంత్రి అనిల్ ధ్వజం..

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రం వాల్ కు ముప్పు ఏర్పడిందని అన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన పనుల పురోగతిపై మేఘా సంస్థ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మేఘా సంస్థ జీఎం సతీష్ బాబు, స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులతో పాటు ఎడమ కాలువకు, నావిగేషన్‌ కెనాల్‌ […]

Advertisement
Update:2021-03-18 02:19 IST

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రం వాల్ కు ముప్పు ఏర్పడిందని అన్నారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించిన ఆయన పనుల పురోగతిపై మేఘా సంస్థ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మేఘా సంస్థ జీఎం సతీష్ బాబు, స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులతో పాటు ఎడమ కాలువకు, నావిగేషన్‌ కెనాల్‌ కు సంబంధించిన సొరంగ మార్గాలను మంత్రి పరిశీలించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు, ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు

డయాఫ్రం వాల్ వ్యవహారంలో టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి అనిల్ మరోసారి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో ముందుగా స్పిల్‌ వే పూర్తి చేసి, ఆ తర్వాత కాఫర్‌ డ్యాం నిర్మించి, వరదనీటిని మళ్లించాక డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సి ఉందని అన్నారు. ఈ పద్ధతిని అనుసరించకుండా ప్యాకేజీలకోసం హడావిడిగా చంద్రబాబు డయాఫ్రం వాల్ కట్టించారని గుర్తు చేశారు. ఇంజినీరింగ్ ప్రొసీజర్ ని ఫాలో కాకపోవడం వల్లే వరద తాకిడికి డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని అన్నారు. ముమ్మాటికీ దీనికి కారణం చంద్రబాబేనని న్నారు. చంద్రబాబు తీరు వల్ల సమయం, డబ్బు.. వృథా అయ్యాయని విమర్శించారు.

ఆ తప్పులన్నీ సరిదిద్దుతున్నాం..
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు మంత్రి అనిల్. సీఎం జగన్‌ నిర్దేశించిన సమయానికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. వరదల సమయానికి నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. 41వ కాంటూరు పరిధిలోని ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మే నెలాఖరు నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఏడు మండలాల పరిధిలోని 17 వేల కుటుంబాలను తరలిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News