అమరావతి వ్యవహారంలో చంద్రబాబుకి సీఐడీ నోటీసులు..

హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్న చంద్రబాబుకి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధానిలో అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషనల్‌ డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ […]

Advertisement
Update: 2021-03-16 01:57 GMT

హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్న చంద్రబాబుకి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రాజధానిలో అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషనల్‌ డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ఇవాళ చంద్రబాబుతో పాటు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చారు.

అసలేంటీ కేసు..
అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందన్న సమాచారం ఉండటంతో.. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్కడ రియల్ వ్యాపారం మొదలు పెట్టారు. అప్పటికే ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కేటాయించిన భూముల్ని కారు చౌకగా కొట్టేశారు. ఆ తర్వాత రాజధానికోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసే సమయంలో ప్రైవేటు వ్యక్తులు వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. బదులుగా.. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఎకరాకు 1500 చదరపు గజాలు ప్రతిఫలంగా పొందారు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులను కొనడమే మొదటి నేరం అయితే, వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ప్రతిఫలం పొందడం మరో నేరం. ఈ నేరంలో ప్రైవేటు వ్యక్తులతోపాటు.. ప్రభత్వ పెద్దల పాత్ర కూడా ఉందని సీఐడీ నిర్థారించింది. దీనిపై విచారణ జరిపి అప్పటి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మెన్ గా ఉన్న చంద్రబాబుకి నోటీసులిచ్చారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు కూడా నోటీసులిచ్చారు. ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్లో ఐపిసి 120 బి, 166, 167, 217 సెక్షన్లకింద కింద కేసు నమోదు చేశారు.

చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ బెదిరింపులకు భయపడబోమని అంటున్నారు. తండ్రి చంద్రబాబుకి నోటీసులు ఇవ్వడంపై తనయుడు లోకేష్ ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు గడ్డంమీద మెరిసిన వెంట్రుకను కూడా జగన్ పీకలేరని తీవ్రంగా మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News