టీవీలు చూసి కాదు.. జగన్ పాలన చూసి ఓటేశారు..

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజలు వైసీపీకి ఘన విజయం అందించారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీవీలు చూసి కాకుండా.. జగన్ పాలన చూసి ఓట్లేశారని చెప్పారు. అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు, ఆయన కొడుక్కి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు, అమరావతి ప్రజలు కూడా సమర్థించినట్టు ఈ ఎన్నికలతో తేలిపోయిందని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఒప్పుకోనందుకు ఇక్కడి ప్రజలు బాబుకి […]

Advertisement
Update:2021-03-15 02:29 IST

ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజలు వైసీపీకి ఘన విజయం అందించారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీవీలు చూసి కాకుండా.. జగన్ పాలన చూసి ఓట్లేశారని చెప్పారు. అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబు, ఆయన కొడుక్కి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు, అమరావతి ప్రజలు కూడా సమర్థించినట్టు ఈ ఎన్నికలతో తేలిపోయిందని చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఒప్పుకోనందుకు ఇక్కడి ప్రజలు బాబుకి బుద్ధి చెప్పారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేసిన బాబు, మీకు పౌరుషం లేదా, రోషం లేదా అంటూ రెచ్చగొట్టారని, ప్రజలు నిజంగానే రెచ్చిపోయారని, తమ పౌరుషాన్ని చంద్రబాబుపై చూపించారని అన్నారు.

ఫలితాల రోజు చంద్రబాబు ఏపీలో లేకుండా ముఖం చాటేశారని, హైదరాబాద్ లో దాక్కున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు పాచి పనులకోసం హైదరాబాద్ వెళ్తారంటూ నీఛంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబుకి గుణపాఠం చెప్పారని, ఏపీకి రావడానికి కూడా ముఖం చెల్లకుండా చేశారని అన్నారు. చంద్రబాబు పుత్రుడు, దత్త పుత్రుడు ఫలితాల సంగతి తెలిసే ముందుగానే ఏపీ విడిచి వెళ్లిపోయారని, వారంతా టూరిస్ట్ నాయకులని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాలో చెత్తమాటలు, చెత్త డిబేట్లకోసం కొతమందిని తీసుకొస్తుంటారని, బేవార్సు రాజకీయాలు చేసేవారితో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తుంటారని అన్నారు. శాంతి కాముకులైన విశాఖ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూసినా ఫలితం లేదని, వారంతా టీడీపీకి గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. టీవీ డిబేట్లు చూడలేదని, జగన్ పాలన చూసి ఓట్లేశారని అన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారంటూ 2019ఎన్నికల్లో ప్రజా తీర్పుని అపహాస్యం చేసిన బాబు, ఇప్పుడు బ్యాలెట్ ఫలితాలను ఎలా విశ్లేషిస్తారని ప్రశ్నించారు. ఏకగ్రీవాలైన చోట ప్రజా తీర్పుని శంకించారు, ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఆపడం చంద్రబాబు వల్ల, నిమ్మగడ్డ వల్ల కూడా కాదని.. ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అన్నారు విజయసాయిరెడ్డి. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ పాతికేళ్లపాటు ఏపీని అప్రతిహతంగా పాలిస్తుందని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.

విశాఖ ఫలితాలపై స్వల్ప అసంతృప్తి..
జీవీఎంసీి ఫలితాలపై స్వల్ప అసంతృప్తి ఉందని, జగన్ తో ఇదే విషయంపై చర్చిస్తానని అన్నారు విజయసాయిరెడ్డి. గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ దక్షిణంలో చాలా వార్డులు వైసీపీ పోగొట్టుకుందని, దానిపై విశ్లేషిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటామని అన్నారు. మాకు ఇది ఒక గుణపాఠం అని వ్యక్తిగతంగా భావిస్తున్నట్టు చెప్పారాయన. విశాఖ పరిధిలో ఎక్కువ సీట్లు సాధించిన ఎమ్మెల్యేలను, ఇన్ చార్జిలను ఆయన అభినందించారు.

చంద్రబాబుకి రిజెక్ట్ బటన్ – మంత్రి కన్నబాబు
మున్సిపల్ ఎన్నికల్లో 98 శాతం స్థానాలు వైసీపీకి వచ్చాయని, జగన్ పాలనకు ఇది నిదర్శనం అని అన్నారు మంత్రి కన్నబాబు. ఈ ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకు చంద్రబాబుకి మూడు సార్లు ప్రజలు రిజెక్ట్‌ బటన్‌ నొక్కారని అన్నారు. చంద్రబాబు, లోకేష్.. విశాఖ ప్రచారంలో ఏం పీకుతారంటూ వ్యంగ్యంగా మాట్లాడారని, విశాఖ ప్రజలు వారిద్దరి అహంభావాన్ని పీకిపారేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్ కి వ్యతిరేకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని.. అయినా విశాఖ ప్రజలు తమని ఆదరించారని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News