చంద్రబాబు తప్పులు.. పోలవరానికి తిప్పలు..

పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రం వాల్ వరదనీటికి కొట్టుకుపోయిందని, ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇది ప్రభావం చూపుతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. లోతుగా విశ్లేషిస్తే.. ఇవన్నీ చంద్రబాబుహయాంలో జరిగిన తప్పులుగా తేలాయి. చంద్ర‌బాబు అండ్ కంపెనీ పోలవరంలో చేసిన తప్పులే, ఇప్పుడు తిప్పలు కొని తెస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కాఫర్ డ్యాం.. కాఫర్ డ్యాం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, నిబంధనలు పట్టించుకోకుండా దాన్ని పూర్తి చేసి పెద్ద తప్పు చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం […]

Advertisement
Update:2021-03-10 10:08 IST

పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రం వాల్ వరదనీటికి కొట్టుకుపోయిందని, ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇది ప్రభావం చూపుతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. లోతుగా విశ్లేషిస్తే.. ఇవన్నీ చంద్రబాబుహయాంలో జరిగిన తప్పులుగా తేలాయి. చంద్ర‌బాబు అండ్ కంపెనీ పోలవరంలో చేసిన తప్పులే, ఇప్పుడు తిప్పలు కొని తెస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా కాఫర్ డ్యాం..
కాఫర్ డ్యాం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు, నిబంధనలు పట్టించుకోకుండా దాన్ని పూర్తి చేసి పెద్ద తప్పు చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నా అది తన ఘనత అంటూ ప్రచారం చేసుకున్నారు. సోమవారం-పోలవారం అంటూ ప్రాజెక్ట్ పూర్తి కాకముందే చంకలు గుద్దుకున్నారు. ప్రణాళిక లేకపోవడం, అనాలోచిత నిర్ణయాలు, నిర్మాణంలో నాన్ ఇంజినీరింగ్ పద్ధతులు అవలంబించడంతో కాఫర్ డ్యామ్ ల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. వాటి నిర్మాణం కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎగువ కాఫర్ ఢ్యాం వల్ల గ్యాప్-1 అప్రోచ్ ఏరియా మొత్తం కోతకు గురైంది.

ఎగువ కాఫర్ డ్యాంతో 2019, 2020 రెండు సీజన్లలోనూ వరద నీరు స్పిల్ వే మీదుగా వచ్చింది. దీంతో స్పిల్ వే ఛానెల్ పనులకు, స్పిల్ వే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే బ్రిడ్జి లో దాదాపు 14 బ్లాకుల్లో ట్రూనియన్ బీమ్ లు, కోన్ లు ఫెయిలైపోయాయి. దీనికితోడు స్పిల్ ఛానెల్ లో నిలిచిపోయిన వరద నీటిని తోడటానికి 2నెలలకు పైగా సమయం పట్టింది. సమయం వృథాతోపాటు ఖర్చు అదనం.

నిర్వాసితుల కష్టాలు..
2019, 2020 సంవత్సరాలలో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు పంటనష్టం, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇదంతా చంద్ర‌బాబు అండ్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో నిబందనలకు విరుద్దంగా కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్లే జరిగిందని తెలుస్తోంది. ఈ వరదల్లో నష్టపోయిన వారికి టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకపోవడం మరింత విచారకరం. సహాయ కార్యక్రమాలు, పునరావాసంపై కూడా టీడీపీ ప్రభుత్వం కనీసం దృష్టిపెట్టలేదు.

అప్రోచ్ ఛానెల్, పైలెట్ ఛానెల్ పనులుకు ఆటంకం ఏర్పడటం కూడా గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్లో భాగ‌మే. మూల లంక ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు కోసం ఏడాదికి రెండు కార్లు పండే 203 ఎకరాల భూమిని నష్టపరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకున్నారు. డంపింగ్ యార్డ్ సమీపంలోని డ్రైనేజ్ కాలువ పూడిపోయినా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోలవరంలో హాస్పటల్, కాలేజ్ లను అభివృద్ది చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటల్లాగే మిలిపోయాయి.

Tags:    
Advertisement

Similar News