ఈ సారి ఎండలు ఎలా ఉంటాయంటే..
చూస్తుండగానే వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది శివరాత్రికి ముందే ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే ముందుముందు ఈ ఎండలు మరింత పెరగబోతున్నాయంటున్నాయి వాతావరణ కేంద్రాలు.. ఈసారి సమ్మర్ ఎలా ఉండబోతుందంటే.. ఇప్పటికే హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 16 డిగ్రీలు ఉంటున్నాయి. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణతోపాటు […]
చూస్తుండగానే వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది శివరాత్రికి ముందే ఎండాకాలం వచ్చేసింది. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అయితే ముందుముందు ఈ ఎండలు మరింత పెరగబోతున్నాయంటున్నాయి వాతావరణ కేంద్రాలు.. ఈసారి సమ్మర్ ఎలా ఉండబోతుందంటే.. ఇప్పటికే హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 16 డిగ్రీలు ఉంటున్నాయి. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణతోపాటు ఉత్తర వాయువ్యంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. అంతేకాదు వంద సంవత్సరాల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు-నమోదవుతాయని తెలిపింది. అలాగే ఈ నెల 15వ తేదీ తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో ఎండలు మొదలవ్వబోతున్నాయట. ఈ నెలాఖరి నుంచి వడగాలులు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రాలు చెప్తున్నాయి.
పోయిన సారి లాక్‌డౌన్‌తో.. సమ్మర్ నుంచి తప్పించుకున్నాం. కానీ ఈ సారి ఎండల ధాటిని ఎదుర్కోక తప్పదు. అందుకే సమ్మర్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
– అన్నింటికంటే ముఖ్యంగా నేరుగా సూర్యకిరణాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– సూర్యకిరణాలు నేరుగా శరీరానికి తగలకుండా సన్ స్క్రీన్ లోషన్, బాడీ లోషన్ లాంటివి రాసుకోవాలి.
– వదులుగా ఉన్న బట్టలు ధరించాలి. అలాగే లైట్ కలర్స్, కాటన్ వస్ర్తాలు ధరించాలి
– తలకు ఎండ తగలకుండా తలమీద టోపీ లేదా రుమాలును వాడాలి.
– వడదెబ్బ తగలకుండా చల్లటి వాతావరణంలో ఉండాలి. మంచినీరు ఎక్కువగా తాగుతుండాలి.