హత్రాస్ రేప్ బాధిత కుటుంబంపై మరో ఘాతుకం.. బాధితురాలి తండ్రి కాల్చివేత

ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకూ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. చట్టం అంటే లెక్క చేయకుండా నిందితులు దారుణాలకు తెగబడుతున్నారు. రెండేళ్ల క్రితం హత్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో అతడు జైలుకు కూడా వెళ్లాడు. ఆనాటి నుంచి బాధితుల కుటుంబంపై కక్ష పెట్టుకున్న నిందితుడు గౌరవ్ శర్మ.. ఫిబ్రవరి 28న బాధితురాలి తండ్రి అమ్రిష్ (47)ను దారుణంగా […]

Advertisement
Update:2021-03-02 09:05 IST

ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకూ నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. చట్టం అంటే లెక్క చేయకుండా నిందితులు దారుణాలకు తెగబడుతున్నారు. రెండేళ్ల క్రితం హత్రాస్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2018లో గౌరవ్ శర్మ అనే వ్యక్తి ఒక యువతిపై లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో అతడు జైలుకు కూడా వెళ్లాడు.

ఆనాటి నుంచి బాధితుల కుటుంబంపై కక్ష పెట్టుకున్న నిందితుడు గౌరవ్ శర్మ.. ఫిబ్రవరి 28న బాధితురాలి తండ్రి అమ్రిష్ (47)ను దారుణంగా కాల్చి చంపాడు. హత్రస్ పోలీస్ బాస్ వినీత్ జైస్వాల్ కథనం మేరకు..

గౌరవ్ శర్మ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు 2018లోనే పిర్యాదు చేయగా.. పోలీసులు అతడిని జైలుకు పంపించారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత అతడికి బెయిల్ రావడంతో విడుదలయ్యాడు. ఇక ఆనాటి నుంచి బాధితురాలి కుటుంబాన్ని వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్నది.

ఫిబ్రవరి 28న గౌరవ్ శర్మ భార్య, అత్త కలసి గ్రామ పొలిమేరల్లో ఉన్న దేవాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడ బాధితురాలు, ఆమె సోదరి ఉన్నారు. వారిద్దరినీ చూసిన గౌరవ్ శర్మ కుటుంబీకులు మాటల దాడి చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగింది. విషయం తెలుసుకున్న గౌరవ్ శర్, అమ్రిష్ అక్కడకు చేరుకున్నారు. వారిద్దరు కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్దం కొనసాగించారు.

ఇలాంటి సమయం కోసమే వేచి చూస్తున్న గౌరవ్ శర్మ.. హుటాహుటిని ఇంటికి వెళ్లి తన తుపాకీతో పాటు మరి కొంత మందిని వెంటేసుకొని తిరిగి దేవాలయానికి వచ్చాడు. రావడంతోనే అమ్రిష్‌పై కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్లు దిగడంతో అమ్రిష్ కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఒకే కుటుంబంపై పలు మార్లు వేధింపులకు పాల్పడటమే కాకుండా ఇప్పుడు కుటుంబ పెద్దను కూడా చంపేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోనికి దిగిన పోలీసులు గౌరవ్ శర్మ కుటుంబంలోని ఒకరిని అరెస్టు చేశారు.

ఈ ఘటనపై వెంటనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగీ ఆధిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. కాగా, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితుడి కూతురు భోరున విలపించింది.

Tags:    
Advertisement

Similar News