వీకెండ్ 2 కన్నడ సినిమాలు
సాధారణంగా తెలుగులోకి తమిళ సినిమాలు ఎక్కువగా డబ్బింగ్ అవుతుంటాయి. ఆ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది కూడా. అయితే ఇప్పుడు తమిళ్ తో పాటు కన్నడ సినిమాలు కూడా తెలుగుతెరపైకి దండయాత్ర చేస్తున్నాయి. కేజీఎఫ్ ఇచ్చిన ఉత్సాహంతో చాలా సినిమాలు తెలుగులోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వీకెండ్ 2 సినిమాలు వస్తున్నాయి. అయితే రెండు ఫార్మాట్స్ లో. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా కటపధారి. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా నిజానికి ఓ […]
సాధారణంగా తెలుగులోకి తమిళ సినిమాలు ఎక్కువగా డబ్బింగ్ అవుతుంటాయి. ఆ ట్రెండ్ ఇంకా
కొనసాగుతోంది కూడా. అయితే ఇప్పుడు తమిళ్ తో పాటు కన్నడ సినిమాలు కూడా తెలుగుతెరపైకి
దండయాత్ర చేస్తున్నాయి. కేజీఎఫ్ ఇచ్చిన ఉత్సాహంతో చాలా సినిమాలు తెలుగులోకి కూడా
వచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వీకెండ్ 2 సినిమాలు వస్తున్నాయి. అయితే రెండు ఫార్మాట్స్ లో.
ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా కటపధారి. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా నిజానికి ఓ
కన్నడ రీమేక్. శాండిల్ వుడ్ లో సూపర్ డూపర్ హిట్టయిన కవులదారి సినిమాకు రీమేక్ ఇది. కన్నడలో
నిర్మించిన ప్రొడ్యూసర్లే, తెలుగులో కూడా ఈ సినిమాను నిర్మించారు. కన్నడ వెర్షన్ ను డైరక్ట్ చేసిన ప్రదీప్
కృష్ణమూర్తి, తెలుగు వెర్షన్ ను కూడా డైరక్ట్ చేశాడు.
ఈ వారాంతం థియేటర్లలోకి రాబోతున్న మరో శాండిల్ వుడ్ సినిమా పొగరు. కన్నడలో హిట్టయిన కరాబు
సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ధృవ సర్జా హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పాటలకు
ఆల్రెడీ యూట్యూబ్ లో మంచి హిట్స్ ఉన్నాయి.
ఇలా ఈ వారాంతం రెండు కన్నడ సినిమాలు, రెండు రూపాల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు
రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.