చర్మంలో తేడాలొస్తే.. డయాబెటిస్ ఉన్నట్టే..

డయాబెటిక్ కు, చర్మానికి సంబంధం ఉందా.. ఉందనే అంటున్నారు నిపుణులు. చర్మంలో వచ్చే మార్పులను బట్టి కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో చర్మంలో ఎలాంటి మార్పులొస్తాయంటే.. రక్తంలో గ్లూకోజ్ నిల్వ ఎక్కువగా ఉంటే సూక్ష్మక్రిములు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.ఈ క్రమంలోనే మధుమేహం లక్షణాలున్నవారిలో కొందరికి చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారితే.. చర్మం మొద్దుబారడం లేదా బాగా పొడిబారడం అలాగే కొద్దిగా దురద అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. ఓసారి డాక్టర్‌ని […]

Advertisement
Update:2021-02-13 10:34 IST

డయాబెటిక్ కు, చర్మానికి సంబంధం ఉందా.. ఉందనే అంటున్నారు నిపుణులు. చర్మంలో వచ్చే మార్పులను బట్టి కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించొచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో చర్మంలో ఎలాంటి మార్పులొస్తాయంటే.. రక్తంలో గ్లూకోజ్ నిల్వ ఎక్కువగా ఉంటే సూక్ష్మక్రిములు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.ఈ క్రమంలోనే మధుమేహం లక్షణాలున్నవారిలో కొందరికి చర్మ సమస్యలు వస్తాయి.

చర్మం పొడిబారితే..
చర్మం మొద్దుబారడం లేదా బాగా పొడిబారడం అలాగే కొద్దిగా దురద అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే.. ఓసారి డాక్టర్‌ని కలవడం మంచిది. ఎందుకంటే తరచూ ఇలా జరుగుతూ ఉంటే షుగర్ ఉండే ప్రమాదముంది. మన శరీరంలో చక్కెర స్థాయిలను బట్టి ఇలాంటి చర్మ వ్యాధులు వస్తాయి. అందుకే ముందుజాగ్రత్తగా షుగర్ పరీక్షలు చేయించుకుంటే బెటర్.

మందంగా మారినా..
చర్మం రంగు మారినా, చర్మం మందంగా మారినా, శరీరంపై అక్కడక్కడా తరచూ బొబ్బలు వస్తున్నా అది ప్రి-డయాబెటిక్ స్టేజి లక్షణం అయి ఉండొచ్చు. ఈ దశలో చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోయి మందంగా తయారవుతుంది. మోకాలి వెనుక, మోచేతుల లోపలివైపు, మెడమీద ఇలా కనిపించొచ్చు.
చర్మంలో తరచూ మార్పులు వస్తుంటే ఒకసారి డాక్టర్‌ని కలిసి షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. మధుమేహ లక్షణాలున్నాయనే విషయం ఎన్నో రకాలుగా మన శరీరం మనకు ముందుగానే హింట్ ఇస్తూ ఉంటుంది. వాటిలో చర్మం కూడా ఒకటి. చర్మం జీవకళ తప్పిందో మనకు ఏదో వ్యాధి ముంచుకొస్తున్నట్టే లెక్క.

Tags:    
Advertisement

Similar News