రవితేజ నుంచి ఇంకో సినిమా
రీసెంట్ గా క్రాక్ తో హిట్ కొట్టాడు రవితేజ. ఇప్పుడు అదే ఊపులో ఖిలాడీ అనే సినిమాను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశాడు మాస్ రాజా. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ మే 28న విడుదలకు సిద్ధమవుతోంది. […]
రీసెంట్ గా క్రాక్ తో హిట్ కొట్టాడు రవితేజ. ఇప్పుడు అదే ఊపులో ఖిలాడీ అనే సినిమాను రెడీ
చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ మోడ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్
చేశాడు మాస్ రాజా.
‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, ‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ని
తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ మే
28న విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ
కోనేరు నిర్మాత. A-స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను
నిర్మిస్తోంది.
ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.