ఇక డిజిటల్ ఓటర్ ఐడీలు.. నేటి నుంచే ప్రారంభం

ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని డాక్యుమెంట్లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ ఫార్మాట్లలో ఉన్న డ్యాక్యుమెంట్లను ఈ-వాలెట్స్, ఈ-మెయిల్స్‌లో భద్రపరుచుకునే వీలుంది. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ తదితర డాక్యుమెంట్లు భద్రపరుచుకోవచ్చు. అయితే ఓటర్ ఐడీకి ఈ అవకాశం లేదు. కేవలం మన ఫిజికల్ డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి భద్రపరుచుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే ఇకపై ఓటర్ ఐడీలను కూడా భద్రపర్చుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది. జాతీయ ఓటరు దినోత్సవాన్ని […]

Advertisement
Update:2021-01-25 06:26 IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని డాక్యుమెంట్లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ ఫార్మాట్లలో ఉన్న డ్యాక్యుమెంట్లను ఈ-వాలెట్స్, ఈ-మెయిల్స్‌లో భద్రపరుచుకునే వీలుంది. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ తదితర డాక్యుమెంట్లు భద్రపరుచుకోవచ్చు. అయితే ఓటర్ ఐడీకి ఈ అవకాశం లేదు. కేవలం మన ఫిజికల్ డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి భద్రపరుచుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే ఇకపై ఓటర్ ఐడీలను కూడా భద్రపర్చుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది.

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం (జనవరి 25) నుంచి ఓటర్ ఐడీలను డిజిటల్ విధానంలోకి మార్చనున్నారు. రాబోయే అసోం, కేరళ, పుదుచ్చెరి, తమిళనాడు, పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ డిజిటల్ ఐడీలను అందరికీ అందుబాటులోకి తేనున్నారు. ఈ-ఎపిక్‌గా పిలవబడే ఈ ఐడీలు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని రెండు దశల్లో ప్రారంభిస్తారు.

కొత్తగా ఓటర్‌గా దరఖాస్తు చేసుకున్న వాళ్లు, గతంలో ఫామ్ 6 తో పాటు తమ ఫోన్ నెంబర్లు ఇచ్చిన వాళ్లు తొలుత డిజిటల్ ఐడీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒకే నెంబర్‌పై పలు ఐడీలు ఉంటే కనుక వారికి డౌన్‌లోడ్ అవదు. ఇక రెండో దశలో మిగిలిన ఓటర్లందరూ ముందుగా ఈ-ఎపిక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని పరిశీలించిన తర్వాత డిజిటల్ ఐడీలు జారీ చేస్తారు.

ఈ డిజిటల్ ఐడీలు సురక్షితమైన క్యూఆర్ కోడ్ కలిగి ఐడీని ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఉంటాయి. వీటిని పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News