హైదరాబాద్‌కు వచ్చిన నిమ్మగడ్డ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఫైట్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ ఎన్నికల ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక్కరు అంటే ఒక్క అధికారి కూడా ఆయన సమావేశంపై కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోలేదు. డీజీపీ రాలేదు. ఇక జిల్లా అధికారులు అటువైపు వస్తారా? అసలే రాలేదు. దీంతో రెండు గంటలు నిమ్మగడ్డ […]
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఫైట్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ ఎన్నికల ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఒక్కరు అంటే ఒక్క అధికారి కూడా ఆయన సమావేశంపై కన్నెత్తి చూడలేదు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోలేదు. డీజీపీ రాలేదు. ఇక జిల్లా అధికారులు అటువైపు వస్తారా? అసలే రాలేదు. దీంతో రెండు గంటలు నిమ్మగడ్డ ఒక్కరే కాన్ఫరెన్స్ హాల్‌లో వేచి చూశారు. ఇక చేసేదేమి లేక డీజీపీకి ఓ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని లేఖలో వివరించారు. ఆతర్వాత ప్రభుత్వం వాహనం పక్కనపెట్టేసి.. ప్రైవేటు వాహనంలో హైదరాబాద్‌కు వచ్చేశారు.
సోమవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరగబోతోంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రారంభం కావాలంటే.. ఉదయం పది గంటలకు 13 జిల్లాల్లో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసాధ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్‌కు వచ్చిన నిమ్మగడ్డ రమేష్ రాత్రి మంతనాలు జరిపి.. ఓ కార్యాచరణ ప్రారంభిస్తారా? లేక రాజ్యాంగ ప్రకారం గవర్నర్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తారా? అనేది చూడాలి. గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఒకవేళ గవర్నర్ ఈ దశలో జోక్యం చేసుకుంటారా? అనేది కూడా చూడాలి.
సుప్రీంకోర్టులో లావు నాగేశ్వరరావు బెంచ్‌కు ప్రభుత్వ పిటిషన్ అలాట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆయన బెంచ్‌లో ఉంటారా? నిమ్మగడ్డ రమేష్‌తో సంబంధాలు ఉన్న ఆయన బెంచ్ నుంచి వైదొలగితే పరిస్థితి ఏంటి? అనేది ఓ పాయింట్. మరొక బెంచ్ కేటాయించడానికి టైమ్ పడుతుంది. ఈ లోపు ఒక రోజు గడచిపోతుంది. మరీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందా? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఎన్నికల సంఘం పంతానికి పోతే.. ఒక్కొక్కదారి మూసుకుపోతోంది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే పరిష్కారం ఎలా ఉంటుందనేది చూడాలి.