విగ్రహాల విధ్వంసం కేసులో మరో ట్విస్ట్​.. అనూహ్యంగా తెరమీదకు గుప్తనిధుల అంశం..!

ఏపీలో విగ్రహాల విధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా ఈ కేసులో గుప్తనిధుల అంశం తెరమీదకు వచ్చింది. కొన్నిచోట్ల గుప్తనిధుల కోసం కూడా నిందితులు ఇటువంటి ఘటనలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలిందట. ఈ కేసులో రాజకీయ పార్టీల నేతలు కూడా ఉన్నారని డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర రాజకీయదుమారం రేగింది. పోలీసులు నిస్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మరోవైపు పోలీసులు తాజా విచారణలో కొన్ని షాకింగ్​ నిజాలు […]

Advertisement
Update:2021-01-18 12:32 IST

ఏపీలో విగ్రహాల విధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా ఈ కేసులో గుప్తనిధుల అంశం తెరమీదకు వచ్చింది. కొన్నిచోట్ల గుప్తనిధుల కోసం కూడా నిందితులు ఇటువంటి ఘటనలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలిందట. ఈ కేసులో రాజకీయ పార్టీల నేతలు కూడా ఉన్నారని డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర రాజకీయదుమారం రేగింది. పోలీసులు నిస్పాక్షికంగా దర్యాప్తు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే మరోవైపు పోలీసులు తాజా విచారణలో కొన్ని షాకింగ్​ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నిచోట్ల గుప్తనిధుల కోసం, మరికొన్ని చోట్ల తాగిన మైకంలో, ఇంకొన్ని చోట్ల స్థానిక కక్షల నేపథ్యంలో ఆలయాల విధ్వంసం సాగినట్టు పోలీసులు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు.

అయితే ఆరు కేసుల్లో ఇప్పటివరకు 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రకాశం జిల్లా తాలుపాడు వీరభద్రస్వామి ఆలయం, చిత్తూరు జిల్లా శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన విగ్రహవిధ్వంసాల్లో మద్యంమత్తు, గుప్తనిధుల వేట, స్థానిక రాజకీయకక్షేల కారణమని పోలీసుల విచారణలో తేలింది.

చిత్తూరు, శ్రీకాకుళం, కడప, కర్నూలు జల్లా ఆళ్లగడ్డలో విగ్రహం విధ్వంసం వెనుక తన భార్య ప్రసవించడం లేదని, విగ్రహ అవశేషాలను తీసుకెళ్లి ఇంట్లో పెడితే ఫలితం ఉంటుందని నిందితుడు భావించినట్లు తేల్చారు. కర్నూలు జిల్లాలోని కొన్ని కేసులో ఆలయకమిటీలు పునరుద్ధరించడం కూడా ఓ కారణమని పేర్కొన్నారు. అయితే తమవాళ్లకు ఆలయకమిటీలో చోటు దక్కకపోవడంతో వారి అనుచరులు ఇటువంటి ఘటనలకు పాల్పడ్డట్టు మరికొన్ని ఘటనల్లో తేలినట్టు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ ఆలయాల విధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.

Tags:    
Advertisement

Similar News