కొవిన్ యాప్ గురించి తెలుసా?

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కొవిన్ యాప్ గురించి తెలుసా..? ప్రపంచంలో అత్యంత పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆపరేట్ చేసే ఈ పోర్టల్ ఎంత ప్ర‌త్యేక‌మైందో.. ఇప్పుడు తెలుసుకుందాం.. కొవిన్ పోర్టల్ ను కేంద్రప్రభుత్వం కరోనా రిలేటెడ్ ఆపరేషన్స్ కోసం వాడుతుంది. ప్రస్తుతం కొవిన్ పోర్టల్ వెబ్ సైట్ ను ఉపయోగిస్తున్నారు. త్వరలో యాప్ ను కూడా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. ఈ కొవిన్‌ పోర్టల్‌.. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. […]

Advertisement
Update:2021-01-17 10:57 IST

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కొవిన్ యాప్ గురించి తెలుసా..? ప్రపంచంలో అత్యంత పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఆపరేట్ చేసే ఈ పోర్టల్ ఎంత ప్ర‌త్యేక‌మైందో.. ఇప్పుడు తెలుసుకుందాం..

కొవిన్ పోర్టల్ ను కేంద్రప్రభుత్వం కరోనా రిలేటెడ్ ఆపరేషన్స్ కోసం వాడుతుంది. ప్రస్తుతం కొవిన్ పోర్టల్ వెబ్ సైట్ ను ఉపయోగిస్తున్నారు. త్వరలో యాప్ ను కూడా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. ఈ కొవిన్‌ పోర్టల్‌.. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. డేటాను సేకరించడం, దానిని విశ్లేషించడం లాంటివన్నీ ఈ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. అంతేకాదు ఫార్మా కంపెనీలో వ్యాక్సిన్ తయారీ నుంచి రాష్ట్రాలకు తరలింపు వరకూ, కోల్డ్‌ చైన్‌ పాయింట్లలో నిల్వ చేయడం నుంచి గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లకు చేర్చడం, ప్రజలకు వేయడం వరకూ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది.

అన్ని భాషల్లో..
ఈ యాప్‌.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, మలయాళీ, పంజాబీ, ఒడిస్సీ,బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఛత్తీస్‌ఘరీ భాషల్లో కమ్యూనికేట్ చేశేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నమూనాల పరీక్షలు, కేసులు, మరణాలు, కంటైన్‌మెంట్‌ జోన్ల వివరాలన్నీ ఇందులో అప్‌డేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉండే 15 రకాల డేటాను కూడా ఎంటర్ చేస్తారు. ఈ పోర్టల్ పై పని చేసేందుకు సుమారు లక్ష మందికి శిక్షణ ఇచ్చారు.

కనెక్టెడ్‌గా ఉంచుతూ..
దీన్ని మరింత అప్‌డేట్ చేసి.. వివరాలు ఎంటర్ చేయడం రాని వాళ్లకు కూడా వీలుండేలా.. స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడుతున్నారు. వివరాలు నోటితో చెప్తుంటే.. అందులో ఆటోమెటిక్‌గా ఎంటర్ అయిపోతాయి. వ్యాక్సిన్ సెంటర్‌లో ప్రాసెస్ మరింత ఈజీగా ఉండేలా ఈ పోర్టల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ పోర్టల్‌ను వ్యాక్సిన్‌ను నిల్వ చేసే కోల్డ్ చైన్ పాయింట్లకు కూడా కనెక్ట్ చేశారు. ఏ వ్యాక్సిన్‌ ఏ రాష్ట్రానికి పంపించారు? ఏ కేంద్రంలో నిల్వ చేశారు? ఎన్నిడోసులు వేశారు? అనే వివరాలన్నీ క్షణాల్లో తెలిసిపోతాయి.

మూడు నెలల్లో వచ్చేస్తుంది
కొవిన్‌ యాప్‌ను రెండు మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తారు. యాప్‌లో ఉండే ప్రశ్నలకు ఆన్సర్ చేసి సొంతంగా ప్రీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందులో ఇచ్చే వివరాలు ఆటోమెటిక్‌గా పోర్టల్‌లో సేవ్ అవుతాయి. ఈ వివరాలను ఫ్యూచర్‌లో ఇతర సదుపాయాలకు కూడా వాడుకునే వీలుంది.

Tags:    
Advertisement

Similar News