వ్యాక్సిన్ వచ్చేస్తోంది

కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేస్తోంది. 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ కు వ్యాక్సిన్ చేరుకోనుంది. తొలి విడతలో భాగంగా 6.5 లక్షల డోసుల వ్యాక్సిన్ పూణే నుంచి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వ్యాక్సిన్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే అక్కడి నుంచి కోఠిలోని ప్రధాన స్టోరేజ్ సెంటర్ […]

Advertisement
Update:2021-01-11 08:44 IST

కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేస్తోంది. 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ కు వ్యాక్సిన్ చేరుకోనుంది. తొలి విడతలో భాగంగా 6.5 లక్షల డోసుల వ్యాక్సిన్ పూణే నుంచి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వ్యాక్సిన్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే అక్కడి నుంచి కోఠిలోని ప్రధాన స్టోరేజ్ సెంటర్ కి తరలిస్తారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తారు.

కేంద్రం వైద్య సిబ్బందికి కోసం రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ పంపిస్తుండగా, రాష్ట్రంలో 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు నిల్వ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ లో 3 కోట్ల డోసులు, జిల్లాల్లో మరో 2 కోట్ల డోసుల నిల్వ సామర్థ్యం గల స్టోరేస్ సెంటర్లును సిద్ధం చేశారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ వ్యాక్సిన్ వేయనున్నారు. తొలిరోజు 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,200 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను
మొదలుపెడతారు.

తొలి విడతలో భాగంగా 2.9 లక్షల మంది ఆరోగ్య కార్యక్తలకు వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా… వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు, భయాలు అవసరం లేదని, తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలయ్యే తొలిరోజే ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలిస్తారు. అక్కడ టీకా వేయించుకునే సిబ్బందితో మాట్లాడతారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరంలో రాష్ట్రస్థాయి వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ పాయింట్‌ను సిద్ధం చేశారు అధికారులు. 15 లక్షల డోసుల నిల్వ సామర్థ్యం గల ఈ స్టోరేజ్ పాయింట్ నుంచి కర్నూలు, కడప, గుంటూరు, విశాఖ ప్రాంతీయ కేంద్రాలకు వ్యాక్సిన్ ను తరలిస్తారు. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,677 కోల్డ్ చైన్ పాయింట్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. వ్యాక్సిన్లను భద్రపరిచేందుకు 7 భారీ ఫ్రీజర్లు, 11 భారీ కూలర్లు, 1,865 డీప్ ఫ్రీజర్లు, 2,182 ఐస్ లైన్డ్ ఫ్రిజర్లు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో 17,032 మంది ఏఎన్ఎంలు పాల్గొననున్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నుండి ఎనిమిది వారాల తరువాత యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయని, అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 30 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News