క్రాక్.. నిర్మాతకు సేఫ్ వెంచర్

వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు రవితేజ. ఇంకా చెప్పాలంటే రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు సాలిడ్ హిట్ లేదు. ఇలాంటి టైమ్ లో అతడి సినిమాకు లాభాలు రావడం మాట అటుంచి, మార్కెట్ జరగడమే పెద్ద విషయం. ఈ విషయంలో క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు అదృష్టవంతుడు. అవును.. క్రాక్ సినిమాను విడుదలకు ముందే లాభానికి అమ్మేశాడు ఈ ప్రొడ్యూసర్. ఈ సినిమాకు హీరో రెమ్యూనరేషన్ కాకుండా ప్రొడక్షన్ కింద మరో 25 కోట్ల రూపాయలు ఖర్చుచేశాడు […]

Advertisement
Update:2021-01-08 08:50 IST

వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు రవితేజ. ఇంకా చెప్పాలంటే రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు సాలిడ్
హిట్ లేదు. ఇలాంటి టైమ్ లో అతడి సినిమాకు లాభాలు రావడం మాట అటుంచి, మార్కెట్ జరగడమే
పెద్ద విషయం. ఈ విషయంలో క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు అదృష్టవంతుడు. అవును.. క్రాక్ సినిమాను
విడుదలకు ముందే లాభానికి అమ్మేశాడు ఈ ప్రొడ్యూసర్.

ఈ సినిమాకు హీరో రెమ్యూనరేషన్ కాకుండా ప్రొడక్షన్ కింద మరో 25 కోట్ల రూపాయలు ఖర్చుచేశాడు నిర్మాత. అయితే లాక్ డౌన్ దెబ్బకు బడ్జెట్ మరో 5 కోట్లు పెరిగింది. అయినప్పటికీ మూవీని అన్ని రైట్స్ కింద 42 కోట్ల రూపాయలకు అమ్మాడు మధు.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ 6 కోట్లకు దక్కించుకుంది. డిజిటల్ రైట్స్ ను ఆహా యాప్ 7 కోట్లకు దక్కించుకుంది. వీటితో కలిపి 42 కోట్లు అన్నమాట. అలా సేఫ్ అనిపించుకున్నాడు నిర్మాత.

అయితే ఇప్పుడు థియేట్రికల్ గా ఇది ఎంత వసూలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 50శాతం ఆక్యుపెన్సీతో ఇది కనీసం 19 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలి. అప్పుడు మాత్రమే బయ్యర్లు సేఫ్ అవుతారు. లేదంటే మరోసారి మాస్ రాజా సినిమా కొంప ముంచినట్టవుతుంది.

Tags:    
Advertisement

Similar News