గుండెల్లో మంటకు చెక్ పెట్టండిలా..

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (జిఇఆర్డి) లేదా గుండెల్లో మంట అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే ఇప్పటి వరకూ దీనిని ట్రీట్‌మెంట్ ద్వారానే నయం చేసేవాళ్లు. అయితే తాజాగా దీనిని లైఫ్‌స్టైల్‌లో మార్పుల వల్ల కూడా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డైట్ ఇంకా లైఫ్‌స్టైల్‌లో ఐదు రకాల మార్పులు చేసుకోవడం ద్వారా జిఇఆర్డి లేదా గుండెల్లో మంట లక్షణాలను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. డైట్, లైఫ్‌స్టైల్‌లో మార్పుల ద్వారా శరీరంలో జరిగే కొన్ని మార్పులపై […]

Advertisement
Update:2021-01-08 13:06 IST

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (జిఇఆర్డి) లేదా గుండెల్లో మంట అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే ఇప్పటి వరకూ దీనిని ట్రీట్‌మెంట్ ద్వారానే నయం చేసేవాళ్లు. అయితే తాజాగా దీనిని లైఫ్‌స్టైల్‌లో మార్పుల వల్ల కూడా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

డైట్ ఇంకా లైఫ్‌స్టైల్‌లో ఐదు రకాల మార్పులు చేసుకోవడం ద్వారా జిఇఆర్డి లేదా గుండెల్లో మంట లక్షణాలను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. డైట్, లైఫ్‌స్టైల్‌లో మార్పుల ద్వారా శరీరంలో జరిగే కొన్ని మార్పులపై పెద్ద ఎత్తున, దీర్ఘకాలిక అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించడం ద్వారా, మహిళలు జిఇఆర్డి లేదా గుండెల్లో మంట సమస్యను మూడింట ఒక వంతు కంటే ఎక్కువ తగ్గించుకోవచ్చని తేలింది.

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (జిఇఆర్డి) లేదా గుండెల్లో మంట అనేది చాలామందికి వచ్చే సాధారణ సమస్య. అమెరికాలో మూడవ వంతు జనాభా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలో కూడా ఈ సమస్యతో బాధపడేవాళ్లు ఎక్కువే. దీని ప్రధాన లక్షణం గుండెల్లో మంట. ఆహారనాళాల్లో గ్యాస్ ఏర్పడి మంటలా అనిపిస్తుంటుంది. అయితే ఇది కేవలం మందులతో నయం అవుతుంది. అయితే, ఈ కొత్త అధ్యయనం డైట్, లైఫ్‌స్టైల్‌లో మార్పుల ద్వారా కూడా జిఇఆర్డి లక్షణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలుస్తుంది.

ఈ ఐదు రకాల మార్పులు ఏంటంటే..
బరువు సరిగ్గా ఉండేలా చూసుకోవడం, ధూమపానం చేయకపోవడం, రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, కాఫీ, టీ, సోడాలను రోజుకు రెండు కప్పులకు పరిమితం చేయడం అలాగే మితమైన హెల్దీ డైట్.

ఈ ఐదు మార్పులను లైఫ్‌స్టైల్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా జిఇఆర్డిని తగ్గించుకోవచ్చు. పైగా జిఇఆర్డి కోసం వాడే మందులుతో దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే దీనిని తగ్గించడానికి లైఫ్‌స్టైల్ ఇంప్రూవ్‌మెంట్‌ను బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా ఉపయోగించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

2005 నుంచి 2017 వరకు జరిగిన ఈ అధ్యయనంలో జిఇఆర్డి లేదా గుండెల్లో మంట లక్షణాల గురించి ప్రశ్నించిన 42 నుంచి 62 సంవత్సరాల వయస్సు గల దాదాపు 43,000 మంది మహిళల డేటా ఉంది . ఆ డేటా ప్రకారం కొన్ని నిర్దిష్టమైన డైట్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌ను పాటించడం ద్వారా జిఇఆర్డి సమస్యను వాళ్లు పూర్తిగా నయం చేసుకోగలిగారు.

Tags:    
Advertisement

Similar News