గంగూలీకి గుండెపోటు.. అదానీ గ్రూప్ కి షాక్

మా వంటనూనె వాడండి.. చాలా లైట్. మీ గుండెకు పూర్తి భరోసా మాది అంటూ.. ఊకదంపుడు ప్రకటనల్ని చాలానే చూస్తుంటాం. దాదాపుగా అన్ని వంటనూనెల కంపెనీలు కూడా రుచి, శుచి కాకుండా గుండె ఆరోగ్యాన్ని హైలెట్ చేస్తూ ప్రకటనలిస్తుంటాయి. అయితే ఇలాంటి ప్రకటనే ఇప్పుడు అదానీ గ్రూప్ కొంప ముంచింది. అదానీ గ్రూప్ కి చెందిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కంపెనీకి వెటరన్ క్రికెటర్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్. నన్ను చూడండి నేను ఎంత హెల్దీగా […]

Advertisement
Update:2021-01-07 04:39 IST

మా వంటనూనె వాడండి.. చాలా లైట్. మీ గుండెకు పూర్తి భరోసా మాది అంటూ.. ఊకదంపుడు ప్రకటనల్ని చాలానే చూస్తుంటాం. దాదాపుగా అన్ని వంటనూనెల కంపెనీలు కూడా రుచి, శుచి కాకుండా గుండె ఆరోగ్యాన్ని హైలెట్ చేస్తూ ప్రకటనలిస్తుంటాయి. అయితే ఇలాంటి ప్రకటనే ఇప్పుడు అదానీ గ్రూప్ కొంప ముంచింది. అదానీ గ్రూప్ కి చెందిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కంపెనీకి వెటరన్ క్రికెటర్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్. నన్ను చూడండి నేను ఎంత హెల్దీగా ఉన్నానో.. మీరు కూడా నా లాగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మా వంట నూనెనే వాడండి.. ఆరోగ్యకరమైన గుండెతోపాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోండి అంటూ పూర్తిగా అతిశయోక్తులతో ఉంటుంది ఆ ప్రకటన. కట్ చేస్తే.. ఈమధ్య గంగూలీ గుండెపోటుకి గురయ్యారు. బైపాస్ సర్జరీ తర్వాత ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. మరి, ఫ్యాట్ త‌క్కువ‌గా ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ ని వాడే గంగూలీకి గుండె పోటు ఎందుకొచ్చినట్టు అనే అనుమానం సహజంగానే ఆ యాడ్ చూసేవారిలో, దాన్ని వాడే వారిలో కలుగుతుంది. అలాంటి అనుమానమే సోషల్ మీడియాలో ఫార్చ్యూన్ ఆయిల్ పై ట్రోలింగ్ కి కారణమైంది. బ్రాండ్ అంబాసిడర్ కే గుండెపోటు వస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే సెటైర్లు పడుతున్నాయి.

నష్టనివారణ చర్యలు..
సోషల్ మీడియాలో హడావిడి మొదలు కావడం, ఫార్చ్యూన్ అమ్మకాల్లో తేడా స్పష్టంగా కనిపించడంతో అదానీ గ్రూప్ అలెర్ట్ అయింది. గంగూలీ కనిపించే ప్రకటనలన్నిటినీ ఆపివేయించింది. విమర్శలు చెలరేగడంతో.. సైలెంట్ అయిపోయిన అదానీ గ్రూప్ గంగూలీ అనారోగ్యం వల్ల ప్రకటనలు ఆపివేశామని, ఆయన కోలుకున్నాక, ఆయన అనుమతితో ప్రకటనలు ప్రసారం చేస్తామని సర్దిచెప్పుకోవడం మొదలు పెట్టింది. అయితే సాధారణ మోడల్స్ తో తిరిగి ఫార్చ్యూన్ బ్రాండ్ ఆయిల్ కి కొత్త ప్రకటనలు తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. క్రికెటర్లు, సినీ తారలతో చాలా కంపెనీలు ఇలాంటి యాడ్స్ చేస్తుంటాయి. అయితే తొలిసారిగా గంగూలీ వ్యవహారంతో ఫార్చ్యూన్ బ్రాండ్ ఇరుకున పడింది.

Tags:    
Advertisement

Similar News