‘కేసీఆర్​ రైతుల పాలిట రాబందు’.. మరోసారి రాములమ్మ ఫైర్​

తెలంగాణ ఫైర్​బ్రాండ్​, బీజేపీ నేత విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. గత కొంతకాలంగా ఆమె సోషల్​మీడియాలో యాక్టివ్​ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్​పై తనదైన శైలిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సీఎం కేసీఆర్​ను తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. ‘తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు. రైతులకు సంబంధించిన మార్కెట్లు , కొనుగోలు కేంద్రాలు బంద్​ అయ్యేలా […]

Advertisement
Update:2021-01-05 10:03 IST

తెలంగాణ ఫైర్​బ్రాండ్​, బీజేపీ నేత విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. గత కొంతకాలంగా ఆమె సోషల్​మీడియాలో యాక్టివ్​ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్​పై తనదైన శైలిలో ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్​ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సీఎం కేసీఆర్​ను తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ పెట్టారు. ‘తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు. రైతులకు సంబంధించిన మార్కెట్లు , కొనుగోలు కేంద్రాలు బంద్​ అయ్యేలా ఉన్నాయి. సీఎం కేసీఆర్​ అన్నదాతల పాలిట రాబందులా మారారు. కేంద్రం మీద నెపం వేస్తూ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను మూసేశారు. రైతులు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? ఇప్పటికే నాలుగువేలకు పైగా కొనుగోలు కేంద్రాల మూసేసినట్టు సమాచారం అందుతోంది. ఇది చాలా అన్యాయం. కేంద్రం రైతులకు మేలు చేసేందుకు వ్యవసాయచట్టాలు తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో మిల్లర్లు, దళారులు రాజ్యమేలుతున్నారు.

పంటధరలను విపరీతంగా తగ్గించేశారు. 40 లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలిపోయినట్టు నా దగ్గర సమాచారం ఉంది. ఈ ధాన్యాన్ని ఏం చేయబోతున్నారు? ఎంఎస్​పీ( కనీస మద్దతు ధర) , రైతు కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చట్టాల్లో ఏముందో తెలియదు కానీ.. ఇక్కడ సీఎం కేసీఆర్​ మాత్రం ముందే వాటిని మూసివేశారు’ అంటూ విజయశాంతి ఫైర్​ అయ్యారు.

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. చట్టంలో ఉన్న పలు అంశాలను రైతులు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ మార్కెట్లు ఎత్తేయడం, మద్దతుధర లేకుండా చేయడం, నిత్యావసర సరుకుల మీద ఉన్న నియంత్రణను తొలగించడం వంటివి రైతులకు, ప్రజలకు కూడా ఎంతో నష్టం చేకూరుస్తాయని.. రైతుసంఘాల నేతలు అంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా తొలుత ఈ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వన్​నేషన్​ వన్​ మార్కెట్​ అనేది ఓ చెత్త చట్టమని.. దీనివల్ల రైతులు నష్టపోతారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రైతు చట్టాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన భారత్​బంద్​కు కూడా టీఆర్​ఎస్​ మద్దతు తెలిపింది. అయితే ఆ తర్వాత ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్​.. మెత్తబడ్డారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను తీసేయనున్నట్టు ఆయన మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే కేసీఆర్​ పరోక్షంగా కేంద్ర చట్టాలను ఆమోదించినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్​పై విమర్శలు చేయడం గమనార్హం.

కొనుగోలు కేంద్రాలు తీసేయడం.. మార్కెట్లు ఎత్తేయడం కేంద్రచట్టంలోని భాగాలే. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లు ఎత్తేస్తే ఆ పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా తాకాలి. కానీ విజయశాంతి మాత్రం తమ పార్టీ తీసుకొచ్చిన చట్టాలను మరిచిపోయి కేసీఆర్​కు విమర్శలు చేయడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News