ఢిల్లీ సీఎం అతిశీపై అల్క లాంబ పోటీ

కల్కాజీ అసెంబ్లీ సీటు అభ్యర్థిత్వం ఖరారు చేసిన కాంగ్రెస్‌

Advertisement
Update:2025-01-03 17:22 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిశీని కాంగ్రెస్‌ నాయకురాలు అల్క లాంబ ఢీకొట్టబోతున్నారు. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమెను పోటీకి దింపుతున్నట్టు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఖరారు చేసిందని వెల్లడించారు. కల్కాజీ అసెంబ్లీ స్థానానికి ఎనిమిది సార్లు ఎన్నికలు జరుగగా రెండు పర్యాయాలు ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. 2020 ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతిశీ మర్లేనా 11 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆప్‌ చీఫ్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కావడం, ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వడంతో సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీంతో అతిశీ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.




 


Tags:    
Advertisement

Similar News