ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయాలు కలగాలి
దేశ ప్రజలకు ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందం కలగాలని కాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ప్రతి ఒక్కకొక్కరికి ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. స్థిరమైన భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Advertisement