ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంత లబ్దిపొందుతున్నారో తెలుసా?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలు లబ్ది పొందుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో సీఎం జగన్ పాలన దేశంలో చర్చనీయంగా మారింది. పేదలకు సాయం చేయాలంటే అపారమైన రాజకీయ అనుభవం ఉండాల్సిన అవసరం లేదని.. ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్త శుద్ది ఉంటే చాలని వైఎస్ జగన్ నిరూపించారు. ఏపీలో ప్రతీ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలు లబ్ది పొందుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో సీఎం జగన్ పాలన దేశంలో చర్చనీయంగా మారింది.
పేదలకు సాయం చేయాలంటే అపారమైన రాజకీయ అనుభవం ఉండాల్సిన అవసరం లేదని.. ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్త శుద్ది ఉంటే చాలని వైఎస్ జగన్ నిరూపించారు.
ఏపీలో ప్రతీ కుటుంబానికి ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ప్రతీ ఇంటిలో ఇద్దరు, ముగ్గురు లబ్దిదారులు ఉంటున్నారు. గత ప్రభుత్వాలన్నీ ఏవేవో కారణాలు చూపించి లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తే.. జగన్ సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా సీఎం జగన్ కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారు. వైఎస్ జగన్ ద్వారా లబ్దిపొందిన ఒక మహిళ తన కుటుంబంలో ఎవరెవరు ఎలా సాయం పొందారో వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె వెల్లడించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.
‘వసతి దీవెన కింద మా ఇద్దరి బిడ్డలకు రూ. 10 వేలు ఇచ్చారు. కరోనా కష్టకాలంలో నా భర్త సెలూన్ ఓపెన్ చేయలేకపోయారు. కానీ ఆ సమయంలో ‘జగనన్న చేదోడు పథకం కింద’ రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు. డ్వాక్రా గూపులలో సున్నా వడ్డీ కింద లబ్దిపొందాం. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మా గ్రూపునకు వచ్చే నెల రూ. 1,77,400 రాబోతున్నాయి. గతంలో మాకు ఇల్లు లేదు.. వర్షం వస్తే తడిసిపోతున్నాం అని దరఖాస్తు చేసినా ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు నా పేరు మీద ఇల్లు వచ్చింది. నాకు గ్రూప్ ద్వారా రూ. 17 వేలు వస్తున్నాయి. వైఎస్ఆర్ ఆసరా కింద రూ. 18,750 కూడా ఇచ్చారు. ఇక గతంలో పించన్ కోసం మా ఇంట్లో వాళ్లు లైన్లలో నిలబడేవాళ్లు. కానీ మా అత్తయ్య పించన్ ఇంటికే వస్తుంది. ఫీజు రీయింబర్స్ కింద మా బాబు బీటెక్ చేశాడు.’
ఇలా ఆ ప్రకాశం జిల్లా మహిళే కాదు… ఎంతో మంది తమకు కలుగుతున్న లబ్దిని చూసి ఆనంద పడుతున్నారు. ఇలాంటి సీఎం మరిన్ని సంవత్సరాలు ఏపీని పాలించాలని కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా కోట్లాది మంది లబ్దిపొందుతున్నారు.