ప్రసాద్‌రెడ్డిపై వేటు...

విశాఖకు చెందిన వైసీపీ నేత కొయ్యా ప్రసాద్‌ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ మేరకు ప్రకటించింది. ఒక ల్యాండ్ డీల్‌లో టీడీపీ నేతలతో కలిసి పనిచేసినట్టు తేలింది. ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి ల్యాండ్ డీల్‌ విషయంలో బెదిరింపులకు పాల్పడినట్టు తేలడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజమండ్రికి చెందిన కల్యాణ్‌ రావు అనే వ్యక్తికి విశాఖలో వంద ఎకరాల భూమి ఉంది. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు […]

Advertisement
Update:2020-08-13 04:58 IST

విశాఖకు చెందిన వైసీపీ నేత కొయ్యా ప్రసాద్‌ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ మేరకు ప్రకటించింది. ఒక ల్యాండ్ డీల్‌లో టీడీపీ నేతలతో కలిసి పనిచేసినట్టు తేలింది. ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి ల్యాండ్ డీల్‌ విషయంలో బెదిరింపులకు పాల్పడినట్టు తేలడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

రాజమండ్రికి చెందిన కల్యాణ్‌ రావు అనే వ్యక్తికి విశాఖలో వంద ఎకరాల భూమి ఉంది. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు ఆయన చనిపోయినట్టు డాక్యుమెంట్లు సృష్టించి భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. తాను బతికి ఉండగానే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఆర్డీవో కోర్టులో ఫిర్యాదు చేశారు. వంద ఎకరాలు తనదే కాబట్టి… తనకే దక్కుతాయని భావించిన కల్యాణ్‌రావు ఆ భూములను విక్రయించాలని భావించారు.

భూమిని విక్రయించాలనుకుంటున్నానని.. కొనేవారు ఎవరైనా ఉంటే చెప్పాలని రాజమండ్రికి చెందిన టీడీపీ నాయకురాలు కొల్లి నిర్మల కుమారికి కల్యాణ్‌రావు చెప్పారు. దాంతో నిర్మల కుమారి… వైసీపీ నేత ప్రసాద్‌ రెడ్డిని కలిసి భూమి విషయం చెప్పారు. రంగంలోకి దిగిన కొయ్యా ప్రసాద్ రెడ్డి… ఆ భూమిని ఎంపీ విజయసాయిరెడ్డి కొనాలనుకుంటున్నారని.. కాబట్టి వాటిని విక్రయించాలంటూ బెదిరించారు.

కల్యాణ్‌ రావు నేరుగా విజయసాయిరెడ్డిని కలిసి కొయ్యా ప్రసాద్‌ రెడ్డి బెదిరిస్తున్న విషయాన్ని వివరించారు. దాంతో విజయసాయిరెడ్డి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేయగా… కొయ్యా ప్రసాద్‌రెడ్డి బెదిరింపులు నిజమేనని తేలడంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News