అయోధ్యలో కరోనా కలకలం

మరో వారం రోజుల్లో అయోధ్య రామజన్మభూమి వద్ద కొత్త రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో అక్కడ కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తున్నది. అగస్టు 5న జరిగే భూమి పూజకు ప్రధాని మోడీ సహా వీఐపీలు చాలా మంది హాజరు కానున్నాను. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పూజల్లో పాల్గొంటున్న ఒక పూజారి సహా 14 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌తో పాటు మరో […]

Advertisement
Update:2020-07-31 01:23 IST

మరో వారం రోజుల్లో అయోధ్య రామజన్మభూమి వద్ద కొత్త రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో అక్కడ కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తున్నది. అగస్టు 5న జరిగే భూమి పూజకు ప్రధాని మోడీ సహా వీఐపీలు చాలా మంది హాజరు కానున్నాను.

ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పూజల్లో పాల్గొంటున్న ఒక పూజారి సహా 14 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌తో పాటు మరో నలుగురు పూజారుకు పరీక్షలు నిర్వహించారు.

అధికారులు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. అయినా సరే వాళ్లందరినీ ఆలయం నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. సహాయక పూజారి ప్రదీప్‌ దాస్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయోధ్య జన్మభూమి కాంప్లెక్స్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 14 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆలయ ట్రస్టు తెలిపింది.

పాజిటివ్ వచ్చిన వాళ్లలో నలుగురు శాశ్వత విధుల్లో ఉండగా, మిగిలిన సిబ్బంది తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, గత శనివారం ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామజన్మభూమి కాంప్లెక్స్‌ను సందర్శించి, భూమిపూజ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆయనతోపాటే సహాయక పూజారి ప్రదీప్ దాస్ ఉన్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ప్రకారమే భూమి పూజ జరుగుతుందని ఆలయ ట్రస్టు తెలిపింది. అయోధ్య నగరంలో ప్రస్తుతం 375 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News