సెల్ఫీ కోసం నదిలోకి.... తరువాత…!

విభిన్నంగా అందరూ ఆశ్చర్యపోయేలా సెల్ఫీలు తీసుకోవాలనే తాపత్రయంతో తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది.  వారి సెల్ఫీల కంటే ఎక్కువగా  … వారు చేస్తున్న ప్రమాదకరమైన ప్రయత్నాలు  చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మధ్య ప్రదేశ్లో ఇద్దరు అమ్మాయిలు చేసిన పని అలాగే ఉంది. ఆరుగులు అమ్మాయిలు కలిసి ఆ రాష్ట్రంలో చిన్ ద్వారా జిల్లాలో ఉన్న పెంచ్ నది ఒడ్డుకి పిక్ నిక్ కి వెళ్లారు. వీరిలో మేఘా జారే, వందనా త్రిపాఠి అనే ఇరువురు అమ్మాయిలు నడుచుకుంటూ […]

Advertisement
Update:2020-07-25 12:40 IST

విభిన్నంగా అందరూ ఆశ్చర్యపోయేలా సెల్ఫీలు తీసుకోవాలనే తాపత్రయంతో తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. వారి సెల్ఫీల కంటే ఎక్కువగా … వారు చేస్తున్న ప్రమాదకరమైన ప్రయత్నాలు చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మధ్య ప్రదేశ్లో ఇద్దరు అమ్మాయిలు చేసిన పని అలాగే ఉంది.

ఆరుగులు అమ్మాయిలు కలిసి ఆ రాష్ట్రంలో చిన్ ద్వారా జిల్లాలో ఉన్న పెంచ్ నది ఒడ్డుకి పిక్ నిక్ కి వెళ్లారు. వీరిలో మేఘా జారే, వందనా త్రిపాఠి అనే ఇరువురు అమ్మాయిలు నడుచుకుంటూ నది మధ్యకు వెళ్లి ఒక రాయిమీద నిలబడి తమ స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ తీసుకోబోయారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా నది ఉప్పొంగి ప్రవహించడం మొదలుపెట్టింది. దాంతో వారు ఉలిక్కిపడి అక్కడినుండి బయటకు రావాలని ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు.

ఒడ్డున ఉన్న మిగిలిన అమ్మాయిలు ప్రమాదం గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. 12 మంది పోలీసులు, ఇంకా కొంతమంది జిల్లా యంత్రాంగం, స్థానికులు కలిసి ప్లాన్ చేసి… ఎంతో శ్రమకోర్చి… తమ ప్రాణాలను పణంగా పెట్టి… ఆ ఇద్దరు అమ్మాయిలను కాపాడారు. సెల్ఫీ పిచ్చితో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్ని జరుగుతున్నా… ఎప్పటికప్పుడు మరొకటి తెరమీదకు వస్తూనే ఉంది.

Tags:    
Advertisement

Similar News