ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించాలని నిర్ణయించారు. ప్రీ ప్రైమరీ విద్య పేరుతో పీపీ-1, పీపీ-2గా విద్యను అందించనున్నారు. పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పీపీ 1, పీపీ 2 తరగతులకు అవసరమైన సిలబస్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 270 […]

Advertisement
Update:2020-07-21 15:06 IST

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించాలని నిర్ణయించారు.

ప్రీ ప్రైమరీ విద్య పేరుతో పీపీ-1, పీపీ-2గా విద్యను అందించనున్నారు. పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పీపీ 1, పీపీ 2 తరగతులకు అవసరమైన సిలబస్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 270 మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి ప్రతి మండలంలో ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా మార్చడం ద్వారా జూనియర్ కాలేజీల కొరతను అధిగమించవచ్చని సమావేశంలో అభిప్రాయపడ్డారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.

టీచర్లలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచేందుకు కొత్తగా ఏర్పడే జిల్లా ప్రతిపాదికన ప్రతి జిల్లాలో ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ఆగస్ట్‌లో పాఠశాలు ప్రారంభించే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభించవచ్చని భావిస్తున్నట్టు మంత్రి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News