మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల కౌంటింగ్‌ షురూ

వీటితోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు

Advertisement
Update:2024-11-23 09:02 IST

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితోపాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలు, నాందేడ్‌, వయనాడ్‌ లోక్‌సభ స్థానాల (ఉప ఎన్నికల) ఓట్లను లెక్కిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు నాందేడ్‌ లోక్‌సభకు ఇటీవల ఓటింగ్‌ జరిగింది. 66.05 శాతం పోలింగ్‌ నమోదైంది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగగా.. 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది. వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంకా గాంధీ ఎన్నికల ఫలితమూ నేడు తేలనున్నది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీగా భద్రతను మోహరించారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ ఉండొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఝార్ఖండ్‌లోని 81 స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో పోలింగ్‌ నిర్వహించారు. ఇక్కడ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశం ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్‌లో మహారాష్ట్రలో మహాయుతి లీడ్‌లో ఉన్నది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది.నాగ్‌పూర్‌ సౌత వెస్ట్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే, కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ సీట్లు 288 కాగా, మేజిక్‌ ఫిగర్‌ 145.బర్హత్‌లో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. గండేలో హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌ లీడ్ లో కొనసాగుతున్నారు.ఝార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్‌ ఫిగర్‌ 41.

Advertisement

Similar News