చత్తీస్‌ఘడ్‌లో పది మంది నక్సల్స్ హతం..జవాన్లు సంబరాలు
చత్తీస్‌ఘడ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇవాళ పది మంది నక్సల్స్ హతం అయ్యారు. ఆనందంలో జవాన్లు చిందేశారు
చత్తీస్‌ఘడ్‌లోని సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేడు పది మంది మావోయిస్టులు హతం అయ్యారు. దీంతో నక్సల్స్‌ను హతమార్చిన ఆనందంలో పోలీసులు చిందేశారు. వెపన్ పట్టుకోని గుంపులుగా నృత్యం చేశారు. గిరిజన తెగల మాదిరిగా డ్యాన్స్ చేశారు. ఏజెన్సీ గ్రామాలైన దంతేస్పురం, నాగారం, బందార్పదార్ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంటా, కిస్టారం ఏరియా కమిటీ నక్సల్స్ సంచరిస్తున్నట్లు పక్క సమాచారంతో నేడు ప్రత్యేక దళాలు కూంభింగ్ చేపట్టాయి.
ఆ ప్రాంతం నుంచి 10 మంది నక్సలైట్ల మృతదేహాలను రికవరీ చేసినట్లు ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. నక్సల్స్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్సాస్ రైఫిళ్లు, ఏకే-47, ఎస్ఎల్ఆర్ గన్లను కూడా సీజ్ చేశారు. జిల్లా రిజర్వ్ గార్డులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.