మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్‌లో ఎన్డీఏ లీడ్‌

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి జోరు.. ఝార్ఖండ్‌లో హోరాహోరీ

Advertisement
Update:2024-11-23 09:33 IST

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యధిక ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుండగా.. జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ లీడ్‌లో ఉన్నది.ఇప్పటివరకు వెలువడి ఫలితాల సరళి ప్రకారం మహారాష్ట్రలోని 260/288లో మహాయుతి 157 స్థానాల్లో, మహావికాస్‌ అఘాడీ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఝార్ఖండ్‌లో 76/81లో ఎన్డీఏ 38, ఇండియా కూటమి 36 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఆమె 29,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి నవ్వ హరిదాస్‌ పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్‌లో మహారాష్ట్రలో మహాయుతి లీడ్‌లో ఉన్నది. ఝార్ఖండ్‌లో జేఎంఎం, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది.నాగ్‌పూర్‌ సౌత వెస్ట్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే, కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్‌ (ఎన్సీపీ), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్‌ పాటిల్‌ ఆధిక్యంలో ఉన్నారు మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ సీట్లు 288 కాగా, మేజిక్‌ ఫిగర్‌ 145.బర్హత్‌లో ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. గండేలో హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌ లీడ్ లో కొనసాగుతున్నారు.సరాయ్‌కెలాలో ఝార్ఖండ్‌ మహా సీఎం చంపయీ సోరెన్‌, ధన్వార్‌లో బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండి ముందంజలో ఉన్నారు.ఝార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్‌ ఫిగర్‌ 41.

Advertisement

Similar News