గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్ అరెస్ట్

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఈకేసులో తొలి అరెస్టు నమోదైంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో కీలక పాత్రధారి స్వప్న సురేష్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు. స్వప్న తో పాటు సందీప్‌ నాయర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో స్వప్న రెండో నిందితురాలు. సురేష్‌ ఏ4. ఆదివారం వీరిని కోచికి తీసుకెళ్లనున్నారు. అక్కడ ఎన్‌ఐఏ కార్యాలయంలో వీరిని విచారించనున్నారు. బెంగళూరులో స్వప్నను అరెస్టు చేసిన సమయంలో ఆమెతో పాటు భర్త, పిల్లలు ఉన్నారు. […]

Advertisement
Update:2020-07-12 01:41 IST

కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది. ఈకేసులో తొలి అరెస్టు నమోదైంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో కీలక పాత్రధారి స్వప్న సురేష్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు. స్వప్న తో పాటు సందీప్‌ నాయర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో స్వప్న రెండో నిందితురాలు. సురేష్‌ ఏ4.

ఆదివారం వీరిని కోచికి తీసుకెళ్లనున్నారు. అక్కడ ఎన్‌ఐఏ కార్యాలయంలో వీరిని విచారించనున్నారు. బెంగళూరులో స్వప్నను అరెస్టు చేసిన సమయంలో ఆమెతో పాటు భర్త, పిల్లలు ఉన్నారు. బెంగళూరులోని కోరమంగళ హోటల్‌లో ఆమెను అరెస్టు చేశారు. స్వప్న ఫోన్‌కాల్‌ను ట్రేసి చేసిన ఎన్‌ఐఏ అధికారులు..ఆమెను బెంగళూరులో పట్టుకున్నారు.

స్వప్నకు అధికార పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెను ప్రశ్నిస్తే డొంక మొత్తం కదిలే అవకాశం ఉంది.

ఈ నెల 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 30 కేజీల బంగారం దొరికింది. డిప్లమాటిక్ కార్గో ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ నుంచి ఈ బంగారం తీసుకొచ్చారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్లో పనిచేసే సరిత్ కుమార్ పేరిట కార్గో బుక్‌ అయింది. సరిత్ కుమార్‌ను కస్టమ్స్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

సరిత్ కుమార్ ద్వారా స్వప్న సురేశ్ పాత్ర వెలుగులోకి వచ్చింది. గతంలో యూఏఈ కాన్సులేట్లో ఆమె పనిచేసింది. అప్పటి నుంచి గోల్డ్‌ స్మగ్లింగ్‌లో ఆమె అరితేరినట్లు తేలింది. ప్రస్తుతం కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ సంస్థలో మేనేజర్‌ గా పనిచేస్తోంది. కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి పలు పార్టీల్లో స్వప్న సురేశ్‌ కనిపించింది. దీంతో ఈ కేసు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెకు పదవి ఇప్పించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. శివశంకర్‍‌పై బదిలీ వేటు వేశారు

ఈకేసు ఎన్‌ఐఏ చేతికి వెళ్లడంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News