ఈనాడు, జ్యోతికి మరోసారి ప్రభుత్వం నోటీసులు

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు రాసిన మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 108 అంబులెన్స్‌ల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసినందుకు రెండు పత్రికలతో పాటు టీడీపీ నేతకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు కథనాలు రాసినందున భేషరతుగా క్షమాపణ […]

Advertisement
Update:2020-07-08 07:12 IST

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు రాసిన మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 108 అంబులెన్స్‌ల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసినందుకు రెండు పత్రికలతో పాటు టీడీపీ నేతకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది.

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాస్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు కథనాలు రాసినందున భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు ప్రభుత్వం హెచ్చరించింది.

అంబులెన్స్‌ల కొనుగోలులో పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరించిందని… టెండర్ల ద్వారానే కొనుగోలు చేసిందని… దీని వల్ల 399 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయిందని నోటీసుల్లో వివరించారు. అయినప్పటికీ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కథనాలు ప్రచురించారని నోటీసుల్లో అభ్యంతరం తెలిపారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ నేత పట్టాభిరామ్‌లు తప్పుడు ఆరోపణలు చేసినందుకు తక్షణం క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News