కరోనాతో ఆస్పత్రి మూసివేత

తమిళనాడును కరోనా వణికిస్తోంది. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతున్నారు. దాంతో ఆస్పత్రులనే మూసివేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. చెన్నైలోని ప్రముఖ విజయా ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైద్యం కోసం ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల్లో విజయా ఆస్పత్రి ఒకటిగా ఉంది. సిబ్బంది కరోనా బారిన పడిన కారణంగా ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు మేనేజింగ్‌ ట్రస్టీ, […]

Advertisement
Update:2020-07-06 04:47 IST

తమిళనాడును కరోనా వణికిస్తోంది. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతున్నారు. దాంతో ఆస్పత్రులనే మూసివేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.

చెన్నైలోని ప్రముఖ విజయా ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న 40 మంది సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైద్యం కోసం ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల్లో విజయా ఆస్పత్రి ఒకటిగా ఉంది. సిబ్బంది కరోనా బారిన పడిన కారణంగా ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు మేనేజింగ్‌ ట్రస్టీ, సీఈవో బి. భరత్‌ రెడ్డి వెల్లడించారు.

విజయా ఆస్పత్రి ట్రస్టీగా ఉంటూ వచ్చిన శరత్‌ రెడ్డి కరోనా సోకి గత నెల 19న చనిపోయారు. శరత్‌ రెడ్డి ప్రముఖ దివంగత సినీ నిర్మాత బి నాగిరెడ్డి మనవడు. విజయా ఆస్పత్రిలో తిరిగి పూర్తి స్థాయి కార్యకలాపాలు మరో 10రోజులు ప్రారంభమవుతాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News