దేశంలో కరోనా ఉగ్రరూపం
ఇండియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సగటున రోజుకు 20 వేల కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 380 మంది కోవిడ్-19 కారణంగా మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 5,48,318కి చేరుకోగా.. 16,475 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. […]
ఇండియాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సగటున రోజుకు 20 వేల కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 380 మంది కోవిడ్-19 కారణంగా మృత్యువాత పడ్డారు.
దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 5,48,318కి చేరుకోగా.. 16,475 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పలు ఆసుపత్రుల్లో 2,10,120 మంది చికిత్స పొందుతుండగా… 3,21,722 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు 1,64,626కి చేరుకోగా, ఢిల్లీలో 83,077కి చేరుకుంది.
తెలంగాణలో ఆదివారం 3,227 శాంపిల్లు టెస్టు చేయగా 983 కేసులు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరుకుంది. నిన్న నలుగురు కోవిడ్ కారణంగా చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 247కి చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 816 కేసులు నమోదయ్యాయి.