సీపీఎస్ సర్వే ... మరింత పట్టుకోల్పోయిన టీడీపీ

జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్- సీపీఎస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించింది. జగన్ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి పనితీరుకు ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు అన్న దానిపై సీపీఎస్ సంస్థ సర్వే నిర్వహించింది. తాజా సర్వేను జూన్‌ 2 నుంచి 8 మధ్య 13 జిల్లాల్లో నిర్వహించారు. సర్వే ఆధారంగా చూస్తే జగన్‌మోహన్ రెడ్డి ఏడాదిలో మరింత […]

Advertisement
Update:2020-06-22 13:22 IST

జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్- సీపీఎస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించింది. జగన్ పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్ రెడ్డి పనితీరుకు ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు అన్న దానిపై సీపీఎస్ సంస్థ సర్వే నిర్వహించింది.

తాజా సర్వేను జూన్‌ 2 నుంచి 8 మధ్య 13 జిల్లాల్లో నిర్వహించారు. సర్వే ఆధారంగా చూస్తే జగన్‌మోహన్ రెడ్డి ఏడాదిలో మరింత పట్టుసాధించినట్టుగా అనిపిస్తోంది. టీడీపీ మరింతగా పట్టుకోల్పోయింది.

ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్ రెడ్డి పనితీరుకు 62.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. 36.1 శాతం మంది సీఎం పనితీరుపై పెదవి విరిచారు. సీఎం పనితీరు పట్ల దక్షిణ కోస్తాలో 74 శాతం మంది, రాయలసీమలో 67.1 శాతం మంది, ఉత్తరాంధ్రలో 58.8 శాతం మంది, గోదావరి జిల్లాల్లో 55.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో సీఎం పనితీరు పట్ల 54.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వే చెబుతోంది.

అన్ని ప్రాంతాల్లోనూ జగన్‌ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కనబరుస్తూ మద్దతు ఇస్తున్నారని సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 55.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. టీడీపీకి 38.3 శాతం ఓట్లు రావొచ్చు. బీజేపీ- జనసేన కూటమికి 5.3 శాతం మంది మద్దతు తెలుపుతున్నారు.

దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో వైసీపీకి తిరుగులేదని సర్వే చెబుతోంది. దక్షిణ కోస్తాలో వైసీపీకి 66.9 శాతం మంది మద్దతు తెలుపుతున్నారు. సీమలో 63. 8 శాతం మంది మద్దతు తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలో 51.1 మంది వైసీపీ పట్ల సానుకూలత కనబరుస్తున్నారు. అమరావతి ప్రాంతాలోనూ టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువగా మద్దతు లభిస్తోంది.

కరోనా నివారణ చర్యలు బాగున్నాయని 75. 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. హామీలను నెరవేర్చారని 63. 9 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. 35 శాతం మంది మాత్రం హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను వాస్తవానికి అతి దగ్గరగా అంచనా వేసిన సంస్థల్లో సీపీఎస్‌ కూడా ఒకటి. వైసీపీకి 133 నుంచి 135 స్థానాలు వస్తాయని అప్పట్లో సీపీఎస్‌ అంచనా వేసింది.

Tags:    
Advertisement

Similar News